టాప్ 5 స్కూటర్స్: 10 గ్రాముల బంగారం ధర కంటే తక్కువే!

2026 ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మన దేశంలో తులం గోల్డ్ రేటు రూ. 1.40 లక్షలకు (24 క్యారెట్స్) చేరుకుంది. ఈ ధరకు ఇండియన్ మార్కెట్లో లభించే ఐదు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి?, వాటి వివరాలు ఏమిటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో

భారతదేశంలో చాలా తక్కువ సమయంలోనే మంచి ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో. దీని ధర రూ. 1.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధరను బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటుకు అయ్యే ఖర్చుతో ఈ స్కూటర్ కొనేయొచ్చు. ఇంకా రూ. 15000 ఆదా అవుతుంది. మంచి డిజైన్, కనెక్టెడ్ ఫీచర్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 176 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ స్పీడ్ 117 కిమీ/గం.

ఏథర్ 450ఎస్

ప్రీమియం లుక్, స్మార్ట్ టెక్ ఫీచర్ కలిగిన ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). అంటే 10 గ్రామ్స్ గోల్డ్ కొనే డబ్బులో రూ. 20వేలు ఆదా చేయొచ్చన్నమాట. స్టైలిష్ డిజైన్ కలిగిన స్కూటర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 161 కిమీ దూరం ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ అన్నమాట.

టీవీఎస్ ఐక్యూబ్

మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్.. ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.35 లక్షలు. అంటే తులం 24 క్యారెట్ల గోల్డ్ కొనే డబ్బుతో రూ. 5000 ఆదా అవుతుంది. ఇది దేశీయ విఫణిలో మల్టిపుల్ వేరియంట్స్, వివిధ రంగులలో లభిస్తుంది. ఇందులో 3.3 కిలోవాట్ బ్యాటరీ.. ఒక ఫుల్ ఛార్జితో 145 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 78 కిమీ/గం మాత్రమే.

బజాజ్ చేతక్

రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే బజాజ్ చేతక్ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). రెట్రో డిజైన్ కలిగిన ఈ స్కూటర్ అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక పూర్తి ఛార్జితో 153 కిమీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు 73 కిమీ వేగంతో ప్రయాణించే ఆ కారు.. చాలామందికి ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటి.

హీరో విడా వీ2

భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా వీ2 కూడా మంచి అమ్మకాలు పొందుతున్న ఓ బెస్ట్ మోడల్. దీని ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). తులం బంగారం ధర కంటే రూ. 20వేలు తక్కువ. సింపుల్ డిజైన్, అట్రాక్టివ్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా.. ఒక ఫుల్ ఛార్జి ద్వారా 165 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కిమీ/గం.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. స్కూటర్ అనేది నిత్యావసరం. బంగారం అనేది పెట్టుబడి. స్కూటర్ కొనుగోలు చేస్తే.. మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవచ్చు. కానీ బంగారంపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.