మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ. ప్రకాష్ కుమార్.. కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం ఇమ్మోర్టల్. మరియప్పన్ చిన్నా.. ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. అరుణ్ కుమార్ ధనసేకరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామ్. సీ.ఎస్ సంగీతం సమకూర్చారు. ఇందులో రొమాన్స్, థ్రిల్లర్, హారర్, పాంటసి ఈ విధంగా నాలుగు రకాల జోనర్స్ కలగలిపి ఉన్నాయి. సినిమా విడుదలకి సంబంధించిన పూర్తి వివరాలు ఏవి కూడా ఇంకా ప్రకటించలేదు. ఆ విశేషాలు తొందరలోనే తెలిసే అవకాశం ఉంది.
ఊహల్లో హీరో..
ఇమ్మోర్టల్ మూవీ ట్రైలర్ చూస్తే అయితే మామూలుగా లేదు. ఇది వరకు తాను నటించిన సినిమాలన్నింటికంటే కూడా ఇది చాలా భిన్నంగా ఉంది. సాధారణ హాస్యంతో కూడిన సన్నివేశాలతో వీడియో మొదలవుతుంది. హీరో, హీరోయిన్ మధ్యలో రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. కథానాయకుడు కలలో అనేక విషయాలు ఊహించుకుంటూ ఉంటాడు.
హీరోయిన్ను ముద్దు పెట్టుకున్నట్టు తనతో ఉన్నట్టు వాటిని తలచుకుని, ఏవేవో ఆలోచిస్తూ చాలా సార్లు నిద్రలోనించి ఉలిక్కిపడి లేస్తుంటాడు. అలా ఈసారి అమ్మాయి కాకుండా విచిత్రమైన జీవి కనిపించడం జరుగుతుంది. తలుపు సందులోనుంచి చుసి తన మీదకు వచ్చేస్తున్నట్టుగా కనిపించడం జరుగుతుంది. ఆ సన్నివేశాలను వీడియోలో చూపించే విధానం చాలా కొత్తగా, ఆసక్తిగా, థ్రిల్లింగ్‌గా ఉంది. కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది చూస్తుంటే. జీవీ. ప్రకాష్ కుమార్ కెరీర్లో ఇమ్మోర్టల్ ఒక మంచి చిత్రంగా మిగిలిపోతుందని అర్థమవుతున్నది.
2006లో మొదటిసారి..
జీవీ. ప్రకాష్ కుమార్ అంటే మామూలేగా మనకు గుర్తొచ్చేది తమిళ చలన చిత్ర రంగానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. కానీ అతనిలో ఇంకో కోణం దాగి ఉంది. నటుడుగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి తానే కథనాయకుడిగా చేసేంత ఎత్తుకు ఎదిగాడు. 2006లో మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మొదటిసారిగా వెయిల్ (తెలుగులో వేసవి సినిమా) అనే తమిళ చిత్రంతో తన ప్రయానాన్ని ప్రారంభించారు. అంతకు ముందే ఏ. ఆర్. రెహమాన్, హారీస్ జయరాజ్ లాంటి పాపులర్ సంగీత దర్శకులు దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తరువాత ఒకొక్కమెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఇప్పటికే అతని సంగీతం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్..
ఇప్పటికే నటుడిగా తన సత్తా ఏంటో చూపించిన ప్రకాష్ కుమార్.. 2008లో ఒక పాటలో చిన్న పాత్రతో మొదలైన నటన 2013లో పూర్తి స్థాయి కథానాయకిడిగా నిలదొక్కుకున్నాడు. జీవీ. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించి.. అందులో సినిమాలు చేశాడు, చేస్తున్నాడు. ఆ విధంగా అటు సంగీత దర్శకుడిగా, ఇటు నటుడుగా, మరోవైపు నిర్మాతగా అన్నీ రకాలుగా తానేంటో నిరూపించుకుంటూ.. ముందుకు సాగుతున్నాడు జీవీ. ప్రకాష్ కుమార్. ఇప్పుడు ఇమ్మోర్టల్ సినిమా ఎలా ఉండబోతున్నదో అనే ఆసక్తిని ప్రేక్షులలో రేకేత్తించాడు. ఇక సినిమా ఎలా ఉంటుందో.. ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందనే విషయాలు తెలుసుకోవాలంటే.. మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.