గతంలో ఎన్నడూ లేనంత పెరుగుతున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులను ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తోంది. గత వారం రోజులు భారీగా పెరుగుతున్న ధరలు ఈ రోజుకు పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. బుధవారం (సెప్టెంబర్ 10) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 210.90 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,10,510 వద్దకు చేరింది. ఇది దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో కూడా కదలికలు జరిగేలా చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, ఏ నగరం అధికం అనే చాలా విషయాలను వివరంగా చూసేద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 1,01,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం ధర రూ. 210.90 పెరిగి.. రూ. 1,10,510 వద్దకు చేరింది. నిన్నటి ధరలో పోలిస్తే.. ఈ రోజు ధరలు కొంత ఎక్కువే. అంతే కాకుండా ఇది ఇప్పటి వరకు గరిష్టం. ఇదే ధరలు బెంగళూరులో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధానిలో గోల్డ్ రేటు
ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఏ మాత్రం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. నిన్నటితో (సెప్టెంబర్ 09) పోలిస్తే.. ఈ రోజు (సెప్టెంబర్ 10) ధరలు కొంత స్వల్పంగానే పెరిగాయి. దేశ రాజధానిలో 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,10,660 (రూ. 220 పెరిగింది) కాగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 101450 (రూ. 200 పెరిగింది).
చెన్నైలో పసిడి ధరలు
విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ర్ రోజూ కొనసాగుతున్నాయి. నేడు ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,10,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 1,01,500 వద్దనే ఉంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
ఈ ఏడాది ప్రారంభంలో రూ. 8వేలు కంటే కూడా తక్కువ ఉన్న ధర.. ఇప్పుడు రూ. లక్ష మార్క్ దాటేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు, రూపాయి విలువ తగ్గడం వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. అమెరికా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ డీలా పడింది. దీంతో చాలామంది పెట్టుబడిదారులు.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీని పసిడికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది ధరలను అమాంతం పెరిగేలా చేసింది.
వెండి ధరలు పైపైకి
బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. వెండి కూడా భవిష్యత్తులో బంగారం అంత రేటుకు చేరుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే కేజీ వెండి రేటు రూ. 1.40 లక్షల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మరో రెండేళ్లలో సిల్వర్ రేటు.. రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టే పెట్టుబడి కూడా సురక్షితమే అని భావిస్తున్నారు.