బంగారాన్ని మర్చిపోవాల్సిందేనా!.. ఏమిటీ ధరలు: ఎందుకిలా పెరుగుతోంది?

Gold and Silver Price Today in India: ఇతర దేశాలతో పోలిస్తే.. భారతీయులే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. 2024 చివర వరకు ఓ మాదిరిగా పెరుగుతూ వచ్చిన ధరలు 2025లో అమాంతం పెరిగిపోతున్నాయి. స్వల్పంగా తగ్గుతూ.. భారీగా పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు, మరోమారు ఎగిసి పడింది. దీంతో పసిడి ధరకు రెక్కలొచ్చాయి.. పది గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరుకుంటోంది. ఈ రోజు (2025 ఏప్రిల్ 17) ధరల విషయానికి వస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97460కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 89350 వద్ద నిలిచింది. నిన్న కూడా ఓ మోస్తరుగా పెరిగిన పసిడి ధర.. ఈ రోజు రూ. 1140 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 1050 (22 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది. దీంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇకపై బంగారం కొనడం సాధ్యమేనా అనుకుంటున్నారు.

హైదరాబాద్ మరియు విజయవాడ ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్స్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. 89200 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 97310 వద్ద నిలిచాయి. ఈ రోజు గోల్డ్ రేటు భారీగా రూ. 1050 (22 క్యారెట్స్ 10 గ్రా) మరియు రూ. 1140 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది. చెన్నైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.

బెంగళూరు, ముంబైలలో కూడా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ఉంటాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఒకింత ఎక్కువే అని స్పష్టమవుతోంది. ఈ ధరలు ఇలాగే కొనసాగుతూ ఉంటే.. బంగారం రేటు రూ. 1 లక్షలు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని తెలుస్తోంది.

వెండి ధరలు: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, వెండి (Silver Price) మాత్రం ఈ రోజు (17 ఏప్రిల్) స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే (రూ. 1,10,000) నేడు కూడా కొనసాగుతాయి. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సిల్వర్ (వెండి) రేటు తక్కువగా ఉంది. దేశ రాజధానిలో కేజీ వెండి రేటు రూ. 1,00,000 వద్ద ఉంది.

Also Read: గోల్డ్ రేటు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా?: దీని ఫార్ములా ఏమిటంటే..

గోల్డ్ రేటు పెరగడానికి కారణం

ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం.. కొనుగోలుదారులు ఎక్కువ కావడమే. దేశంలో కొనుగోలు చేసేవారితో పోలిస్తే.. బంగారం నిల్వలు తక్కువగా ఉన్నాయి. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది మాత్రమే కాకుండా అమెరికా సుంకాల విషయంలో కొంత విరామం ప్రకటించడంతో పెట్టుబడిదారులు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అవుతోంది.

ఇది మాత్రమే కాకుండా పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైపోయింది. కాబట్టి గోల్డ్ రేటు త్వరలోనే తప్పకుండా లక్ష రూపాయలకు చేరుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇతర పెట్టుబడులతో పోలిస్తే.. బంగారం మీద పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. దీంతో చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.

Leave a Comment