Gutta Jwala Says About Item Song In Nithin Movie: సాధారణంగా ఇతర రంగాలకంటే సినిమా రంగంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. పైకి రంగుల ప్రపంచంలా కనిపించినా, అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌లో ఎందుకు కనిపించాల్సి వచ్చిందో.. ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ ‘గుత్తా జ్వాలా’ (Gutta Jwala) పేర్కొన్నారు.
సినీ ప్రేమికులకు గుత్తా జ్వాలా గురించి పెద్దగా తెలుసుండకపోవచ్చు. కానీ హీరో ‘నితిన్’ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే పాటలో కనిపించిన అమ్మాడో ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆమె గుత్తా జ్వాలా. నిజానికి ఈమె ఒక బ్యాట్మింటన్ స్టార్. అయితే నితిన్ కోరిక మేరకు మాత్రమే.. తనకు సినిమాల్లో కనిపించడం ఇష్టం లేకపోయినా.. కనిపించాల్సి వచ్చిందని వెల్లడించింది.
చాలా ఇబ్బందిగా ఉంటుంది
ఇప్పటికి కూడా ఆ పాట తలచుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే తనకు చాలా సినిమాల్లో నటించడానికి అవకాశం వచ్చిందని, వాటన్నింటికి నో చెప్పానని గుత్తా జ్వాలా పేర్కొన్నారు. నితిన్ నాకు మంచి ఫ్రెండ్. ఒక సందర్భంలో నువ్వు నా సినిమాలో కనిపిస్తున్నావు అని చెప్పాడు. అప్పుడు సరదాగా నేను కూడా ఒకే చెప్పేసాను, కానీ మూడు నెలల తరువాత పాట రెడీగా ఉంది అని నాకు కబురు చేశారు. అప్పుడు చేసేదేమీ లేక సెట్‌లో అడుగుపెట్టాల్సి వచ్చింది.
చాలా విషయాల్లో సర్దుకుపోవాలి
టాలీవుడ్ చిత్ర సీమలో కనిపించాలంటే తెల్లగా ఉంటే సరిపోతుంది. సినిమాల్లో నటించే అవకాశాలు నాకు బోలెడన్ని వచ్చాయి. కానీ నాకు ఆసక్తి లేకుండా ఉండిపోయాను. అంతే కాకుండా సినిమా రంగంలో పనిచేయాలంటే.. సిగ్గు ఉండకూడదు, చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది.
సినిమా రంగంలో పనిచేసేవాళ్ళు చాలా కష్టపడుతుంటారు. నిజం చెప్పాలంటే సినిమా రంగంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే. అంతెందుకు నా భర్త విష్ణు విశాల్. హీరో మాత్రమే కాకుండా.. నిర్మాత కూడా. ఆయన ఎంత కష్టపడుతుంటారో నేను స్వయంగా చూస్తుంటాను. నేనైతే బ్యాట్మింటన్ ఆడిన తరువాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను. కానీ నా భర్తకు మాత్రం.. ఎప్పుడూ టెన్షన్. ఓ వైపు డబ్బులు, మరోవైపు సీన్లు బాగా వచ్చాయా? లేదా? ఇలా చాలా ఆందోళనలు ఉంటాయి. ఆయన రెడీ అవ్వడానికి కూడా కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అన్నీ కరెక్టుగా ఉండాలనుకుంటారని గుత్తా జ్వాలా చెప్పారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ సినిమా అప్పుడే: అధికారిక ప్రకటన వచ్చేసింది
డ్రెస్ చిన్నదవుతూ వచ్చింది
ఇక సాంగ్ విషయానికి వస్తే.. నితిన్ కోసం చేసాను. మొదటి రోజు సెట్‌లోకి అడుగుపెట్టిన తరువాత మోకాలి వరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. ఆ తరువాత డ్రెస్ కొంచెం కొంచెం చిన్నాడిపోతూ వచ్చింది. అదంతా ఏంటో అనుకున్నాను, అయితే నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తయింది. బయటపడ్డాను. అప్పటి వరకు ప్లాపులతో బాధపడుతున్న నితిన్‌కు నేను నటించడంతో హిట్ లభించింది. నావల్ల ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది. అంతే కాకుండా నేను నటించిన కారణంగా.. ఆ సినిమా నేషనల్ మీడియాలో కూడా వస్తుందని నితిన్ చాలా సంతోషపడ్డాడు.. అని గుత్తా జ్వాలా పేర్కొంది.