Health Benefits For Fenugreek: ఆరోగ్యమే మహాభాగ్యం అనేది లోకోక్తి. ఎంత డబ్బు ఉన్నా.. ఆరోగ్యం సరిగ్గా లేకుంటే అదంతా వృధా అనే చెప్పాలి. ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ‘డయాబెటిస్’ (చక్కెర వ్యాధి). ఈ వ్యాధిబారిన పడినవారు ప్రతి రోజూ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారు కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు రోజూ మెంతులను తీసుకోవడం వల్ల.. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చూడ్డానికి మెంతులు చిన్నవిగా ఉన్నప్పటికీ.. దీనివల్ల కలిగే లాభాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. మెంతి గింజలలో చాలా పోషకాలు ఉన్నాయి, వీటిని కూరలలో రుచికి ఉపయోగిస్తారు. కానీ వీటిని నానబెట్టి తింటే మాత్రం చాలా గొప్ప ఫలితాలను అందిస్తుంది.
మెండుగా మెంతులలో పోషకాలు
మెంతులలో కాల్షియం, ఐరన్, యాంటీ యాక్సిడెంట్స్ మరియు పాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువును తగ్గించడంతో పాటు, జీర్ణక్రియ సంక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. రాత్రి నానబెట్టిన మెంతులను.. ఉదయం గోరువెచ్చని నీటిలో ఉదయం తీసుకోవడం వల్ల.. అనేక వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చు.
రెండు లేదా మూడు వారాలు మెంతులను.. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు మనకే స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంలో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. రోజూ మెంతులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు కూడా కూడా ఇవి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. మెంతులు నొప్పిని తగ్గించే గుండం కలిగి ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి కూడా మెంతులు ఉపయోగపడతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది
మెంతులలో ఉండే విటమిన్ కే.. ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో మెంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల.. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల.. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తద్వారా రక్తహీనత కూడా తగ్గుతుంది. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Also Read: సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?
ప్రతి రోజూ మెంతులను తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతోనే.. నానబెట్టిన మెంతులను తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి.మలబద్దకం సమస్య కూడా దూరమవుతుంది. ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, కఫ వ్యాధులను నయం చేయడంలో కూడా మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. నానబెట్టిన మెంతులు మాత్రమే కాకుండా.. మొలకెత్తిన మెంతుల వల్ల కూడా ప్రయోజనాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గమనించండి: పైన చెప్పిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మెంతులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. అయితే మెంతులు అందరికి పడకపోవచ్చు. కాబట్టి వైద్య నిపుణుల సలహా తీసుకుని మెంతులను తీసుకోవడం మంచింది. ఎందుకంటే మెంతులు వల్ల కూడా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. వీటన్నింటిని పాఠకులు దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి.