మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

Hero Mavrick 440 Launched in India: భారతదేశంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero Motocorp) దేశీయ విఫణిలో ఎట్టకేలకు ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘మావ్రిక్ 440’ (Mavrick). ఈ బైక్ ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Hero Mavrick 440 Price)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త హీరో మావ్రిక్ 440 మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బేస్, మిడ్ మరియు టాప్ వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 1.99 లక్షలు, రూ. 2.14 లక్షలు, రూ. 2.24 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).

  • హీరో మావ్రిక్ 440 బేస్ – రూ. 1.99 లక్షలు
  • హీరో మావ్రిక్ 440 మిడ్ – రూ. 2.14 లక్షలు
  • హీరో మావ్రిక్ 440 టాప్ – రూ. 2.24 లక్షలు

ఇంజిన్ (Hero Mavrick 440 Engine)

హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగానే కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ అదే 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6000 rpm వద్ద 26 హార్స్ పవర్ మరియు 4000 rpm వద్ద 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కావున ఈ బైక్ మంచి పనితీరును అందించే అవకాశం ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్ (Hero Mavrick 440 Design & Features)

మంచి డిజైన్ కలిగిన ఈ బైక్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, బార్ ఎండ్ మిర్రర్స్ మరియు చిన్న టెయిల్ సెక్షన్‌తో కూడిన సింగిల్ పీస్ సీట్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ మరియు మెసేజ్ అలర్ట్‌లకు సపోర్ట్ చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి. ఇందులో USB C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

బుకింగ్స్ అండ్ డెలివరీ (Hero Mavrick 440 Bookings And Delivery)

హీరో మోటోకార్ప్ కంపెనీ ఈ కొత్త బైక్ కోసం రూ. 5000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున డెలివరీలు 2024 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 15 లోపల ఈ బైక్ బుక్ చేసుకున్నవారు కంపెనీ అందించే రూ. 10000 విలువైన యాక్ససరీస్ ఉచితంగా పొందవచ్చు. ఆ తరువాత (మర్చి 15 తరువాత) బుక్ చేసుకున్న వారికి ఈ యాక్ససరీస్ లభించే అవకాశం లేదు.

Don’t Miss: Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..

ప్రత్యర్థులు (Hero Mavrick 440 Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సీబీ350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఈ మావ్రిక్ 440 అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.