తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది నిన్న (2025 నవంబర్ 07) థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ఈ మూవీలో ఒక తిరువీర్ తప్పా దాదాపు మిగిలిన వారంతా కూడా కొత్తవారే. మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొత్తవారే కావడం గమనార్హం. ఏ మాత్రం అంచనాలు లేకుండా మాములుగా విడుదలైన, ఒక సాదసీదా చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అయితే ఆ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేశారు. దీనికి సంబంధించిన విజయోస్తవ సభను మూవీ టీమ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్ ఏమన్నారంటే..
తిరువీర్ కొత్త పంథా
సినిమా ఫంక్షన్లలోనే కాదు, సాధారణంగా.. చాలా కార్యక్రమాల్లో మాట్లాడే వ్యక్తులంతా కూడా ప్రారంభంలో ఏం చెప్పాలో తెలియక ఇష్టం ఉన్నా లేకున్నా మీడియావారికి, పోలీస్ వారికి ఇంకా కొన్ని పేర్లు చెప్పి తరువాత అందరికీ నమస్కారం అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొంతమంది వారి వారి శైలిలో వారికి తోచింది చెబుతుంటారు. అయితే తిరువీర్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పలేదట. మరి ఎందుకో ఏమో కారణాలు అయితే తెలియదు.
ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ చర్చించాల్సి వచ్చింది అంటే.. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. ఈ సంధర్బంగా హైదరాబాద్‌లో బ్లాక్బస్టర్ సక్సెస్‌ఫుల్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.
సినిమా విజయానికి కారణం
ఇందులో భాగంగా మూవీ హీరో తిరువీర్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు సాధారణంగా అందరు చెప్పినట్టు గా మీడియా వారికి నమస్కారం, ఇక్కడ కి వచ్చినందుకు ధన్యవాదములు అని నేను ఎప్పుడు చెప్పలేదు. మామూలుగా అందరికీ నమస్కారం అని చెబుతుంటాను. కానీ ఫస్ట్ టైమ్ నాకు మీడియా విలువ ఏంటో తెలిసింది. ఇప్పుడు చెబుతున్న మీడియా వారికి శిరస్సు వంచి దండం పెడుతున్నా అన్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక రిపోర్టర్, ఒక క్రిటిక్ రైటర్.. మీడియా వ్యక్తులు, వెబ్‌సైట్ కూడా ఒక్క నెగెటివ్ రివ్యూ ఇవ్వలేదని అర్థమైంది. మీడియా కారణంగానే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. కాబట్టి ఆయన అలా చెప్పుకొచ్చారు.
సక్సెస్.. వాళ్లకు బలం
ఇంకో విషయం ఏమిటి అంటే ఎవరు కూడా సినిమాకి రేటింగ్ 2.7 తగ్గించి ఇవ్వలేదు. అంతకు పైనే అందరు ఇచ్చారు. పెద్ద పెద్ద మూవీ వాళ్లకు నెగెటివ్ చెప్పే వాళ్లు కూడా ఈ రోజు “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ” సినిమాకు మంచి రివ్యూ ఇవ్వడం సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ప్లస్ అయింది. అంతేకాకుండా సినిమా కూడా చాలా న్యాచురల్‌గా, కామెడీ కోసమే ఎక్కడ కూడా బూతులు వాడకుండా ఒక స్వచ్ఛమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం వాళ్ల కూడా విజయానికి కారణం అయింది. కొత్తగా పరిచయమైన మూవీ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్ సందీప్‌లకు మరిన్ని సినిమా ప్రయోగాలు చేయడానికి ఈ సక్సెస్ ఒక బలాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు.