2025లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ – ఇదిగో జాబితా..

సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తూ.. కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే చాలామంది మదిలో మెదిలే ఓ ప్రశ్న.. 2025లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి ఎవరు?, తరువాత జాబితాలో ఎవరున్నారు అనే. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం..

మొదటి స్థానంలో..

సౌత్ ఇండియా సినిమా ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ‘సాయి పల్లవి‘ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో నటించిన తండేల్ సినిమాకు ఈమె రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 3కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఖచ్చితంగా చెప్పలేము. కాగా రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న.. నితేశ్ కుమార్ రామాయణ త్రయం (మూడు సినిమాలు) కోసం ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండో స్థానంలో..

ఇక రెండో స్థానంలో నేషనల్ క్రష్, పుష్ప నటి రష్మిక మందన్న ఉన్నారు. ఈమె పుష్ప 2 సినిమాకు పారితోషికంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు టాక్. చావా సినిమాకు రూ. 4కోట్లు, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు రూ. 12 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు చెబుతారు.

మూడో స్థానంలో..

మన జాబితాలో మూడో స్థానంలో.. నయనతార ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో.. నయనతార కూడా ఉన్నారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ జాబితాలో ఈమె కూడా చోటు దక్కించుకుంది. నయనతార ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.

నాలుగో స్థానంలో..

దక్షిణాది హీరోయిన్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి త్రిష. తరగని అందంతో.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తుంది. ఈమె కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే కథానాయకిల జాబితాలో ఒకరుగా ఉన్నారు. త్రిష ఒక్కో సినిమాకు.. రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా విశ్వంభర సినిమా కోసం ఈమె రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఐదో స్థానంలో..

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ పేరును సొంతం చేసుకున్న స్వీటీ (అనుష్క శెట్టి).. కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో ఐదో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు పారితోషికం తీసుకుంటుందని చెబుతారు.

ఆరో స్థానంలో..

ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా.. స్పెషల్ సాంగ్‌లలో కూడా కనిపించే ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఈమె సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులు, కలైమామణి అవార్డు వంటి అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

Leave a Comment