Hot Topic in Social Media Maruti Wagon R Burial Ceremony: సాధారణంగా ఎక్కడైనా మనిషి చనిపోతే సమాధి చేస్తాం. ఇంకా కొంతమంది ఇష్టమైన పెంపుడు జంతువులు చనిపోతే సమాధి చేస్తారు. కానీ కారుకు ఎవరైనా సమాధి చేస్తారా? ఇది చదవగానే.. కారుని సమాధి చేయడం ఏమిటి? అనే ప్రశ్న మీ మనసులో పుట్టే ఉంటుంది. ఈ కథనంలో మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. వచ్చేయండి.
కొన్ని నివేదికల ప్రకారం.. ఒక గుజరాతీ కుటుంబం తమకు ఎంతో ఇష్టమైన కారుకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి ఏకంగా 1,500 మంది హాజరు కావడం గమనార్హం. కారు అంత్యక్రియలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మారుతి వ్యాగన్ ఆర్ సిల్వర్ కలర్ కారును 15 అడుగుల గొయ్యిలో పెట్టడం చూడవచ్చు.
గులాబీ రేకులతో నివాళి
ఇక్కడ కనిపిస్తున్న కారు 2010 మోడల్ అని తెలుస్తోంది. కారును పువ్వులతో బాగా అలంకరించి.. రూఫ్ మీద గులాబీ రేఖలను పరిచారు. ఆ తరువాత దానిపైన ఆకుపచ్చ వస్త్రం కప్పి ఉండటం చూడవచ్చు. మొత్తం మీద మనిషికి చేసినట్లే.. కారుకు కూడా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన సంజయ్ పోలారా అనే రైతు.. తన కారుకు ఈ విధంగా వీడ్కోలు పలికారు.12 సంవత్సరాలు తనకు సేవలందించిన కారుకు.. తన పొలంలోనే అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. పూజారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కారుకు ఘనంగా వీడ్కోలు
ఈ కార్యక్రమంలో సంజయ్ కుటుంబ సభ్యులు కారయు పూజలు చేశారు. ప్రజలు గులాబీ రేకుల వర్షం కురిపించారు. పూజారులు మంత్రాలను పఠించారు. చివరకు అందరూ కలిసి జాగ్రత్తగా కారుకు వీడ్కోలు పలికారు. అక్కడే ఉన్న ఎక్స్‌కవేటర్ మట్టిని ఆ కారుపై పోసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నిజానికి ఈ కారు తనకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని.. కారు యజమాని పేర్కొన్నారు. 12 సంవత్సరాల క్రితం ఈ కారును కొనుగోలు చేసాను. అప్పటి నుంచి కూడా నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. అందుకే ఈ కారును అమ్మడానికి నాకు మనసురాలేదు. కాబట్టి నా పొలంలో పాతిపెట్టాను. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శం అవ్వాలని భావిస్తున్నాను. కారుకు అంత్యక్రియలు నిర్వహించడానికి సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. కారుకు సంప్రదాయ హిందూ పద్దతిలోనే అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. కారును పూడ్చిన తరువాత ఓ చెట్టును కూడా నాటడం జరిగిందని ఆయన అన్నారు.
లక్షల రూపాయల ఖర్చు
భారతదేశంలో ఇది చాలా అరుదైన సంఘటన అనే చెప్పాలి. ఒక మనిషికి అంత్యక్రియలు చెయడానికే వెనుకాడే ఈ రోజుల్లో కారుకు గంభీరంగా లక్షల రూపాలు ఖర్చు చేసి అంత్యక్రియలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కారు మీద.. యజమానికి ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.
మన దేశంలో చాలామంది వాహనాలను కూడా అదృష్టంగా భావిస్తారు. వాటితోనే మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడే పూజ చేసి, ఆ తరువాత ఉపయోగించే సంప్రదాయం మనది. కారును కొనుగోలు చేసిన తరువాత కూడా.. దసరా లేదా దీపావళి పండుగల సమయంలో కూడా వాటికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాదికి ఒకసారి పూజ చేస్తే.. సురక్షితంగా మనల్ని కాపాడుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజగా.. ఉత్తమ భారతదేశంలో విశ్వకర్మ పూజ అని పిలుస్తారు. మొత్తం మీద భారతదేశంలో వాహనాలకు పూజ చేయడం కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది. అయితే కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం అనేది.. మాత్రం ముమ్మాటికీ కొత్తే అని స్పష్టమవుతోంది.
गुजरात के अमरेली में कार की समाधि…
एक किसान ने अपनी लकी कार को बेचा नहीं बल्कि अपने ही खेत में समाधि दी महापुरुष या तो कोई इंसान को समाधि दी जाती है लेकिन गुजरात में अपने लकी कर को अपने ही खेत में शास्त्रों विधि करके और सगे संबंधी सबको बुलाकर कर को समाधि दी…@MeghUpdates pic.twitter.com/wDZuphuqyM
— Raajeev Chopra (@Raajeev_Chopra) November 8, 2024