క్రెటా నైట్ ఎడిషన్: మతిపోగోట్టే కలర్ ఆప్షన్.. అంతకు మించిన ఫీచర్స్

Hyundai Creta Knight Edition Launched: హ్యుందాయ్ కంపెనీ తన ఆరా ఈ సీఎన్‌జీ వేరియంట్ లాంచ్ చేసిన తరువాత మరో స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఆ స్పెషన్ ఎడిషన్ పేరు ‘క్రెటా నైట్ ఎడిషన్’. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైస్ (Price)

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్’ (Hyundai Creta Knight Edition) ధరలు రూ. 14.51 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది ఎస్ (ఓ) మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లుగా.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ నైట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ.5000 ఎక్కువ.

వేరియంట్స్

క్రెటా నైట్ ఎస్ (ఓ) పెట్రోల్ ఎమ్‌టీ: రూ. 14.51 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) పెట్రోల్ సీవీటీ: రూ. 16.01 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) పెట్రోల్ ఎమ్‌టీ: రూ. 17.42 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) పెట్రోల్ సీవీటీ: రూ. 18.88 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) డీజిల్ ఎమ్‌టీ: రూ. 16.08 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) డీజిల్ ఏటీ: రూ. 17.58 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) డీజిల్ ఎమ్‌టీ: రూ. 19.00 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) డీజిల్ ఏటీ: రూ. 20.15 లక్షలు

డిజైన్ అప్డేట్స్

కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ యొక్క బ్లాక్ అవుట్ గ్రిల్, బ్లాక్ లోగో, రెడ్ కాలిపర్‌లతో కూడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అంతే కాకుండా స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, సీ-పిల్లర్ గార్నిష్, స్పాయిలర్, ఓఆర్వీఎమ్ వంటివన్నీ నలుపు రంగులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కారును చాలా ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

ఫీచర్స్

చూడచక్కని బ్లాక్ అవుట్ థీమ్ కలిగిన హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్.. డ్యూయెల్ టోన్ గ్రే ఇంటీరియర్ కలర్ స్కీమ్ పొందుతుంది. స్పోర్టియర్ మెటాలిక్ ఫినిష్డ్ పెడల్స్ కూడా ఇందులో చూడవచ్చు. అయితే ఫీచర్స్ విషయంలో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదని తెలుస్తోంది. కాబట్టి స్టాండర్డ్ మోడల్ యొక్క అన్ని ఫీచర్స్ కూడా నైట్ ఎడిషన్ కారులో కూడా ఉన్నాయి.

బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులో ఉన్న క్రెటా నైట్ ఎడిషన్‌ను.. ఇప్పుడు టైటాన్ గ్రే మ్యాట్ పెయింట్ స్కీమ్‌తో కొనుగోలు చేయాలనుకుంటే రూ. 5000 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్యాబిన్ సిల్వర్ కలర్ ఇన్సర్ట్‌లకు బదులుగా.. రెడ్ కలర్ ఇన్సర్ట్‌లను కూడా పొందుతుంది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

పవర్‌ట్రెయిన్స్

కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 115 హార్స్ పవర్ మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సీఈటీ గేర్‌బాక్స్ పొందుతుంది.

క్రెటా నైట్ ఎడిషన్ యొక్క డీజిల్ ఇంజిన్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 116 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో వస్తుంది. రెండు ఇంజిన్స్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తాయని భావిస్తున్నాము.

Don’t Miss: ఎక్కువ మైలేజ్ ఇచ్చే Hyundai కొత్త కారు.. ధర చాలా తక్కువే
అమ్మకాల్లో దూసుకెళ్తున్న క్రెటా

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ క్రెటా, ఇప్పుడు నైట్ ఎడిషన్ రూపంలో రావడం వాహనప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ చాలామంది కస్టమర్లను తప్పకుండా ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. కాబట్టి ఇది తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.