26.7 C
Hyderabad
Friday, April 4, 2025

సూర్యకుమార్ యాదవ్ ఇంతమంచి కారు కొన్నాడా? వారెవ్వా ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Suryakumar Yadav Mercedes Benz G63 AMG: ప్రముఖ క్రికెటర్ ‘సూర్యకుమారి యాదవ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టి అభిమానుల మనసుదోచుకున్నాడు. మంచి క్రికెటర్‌గా పేరుపొందిన సూర్యకుమార్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే ఎప్పటికపుడు తనకు నచ్చిన మరియు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG) కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

సూర్యకుమార్ యాదవ్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గమనిస్తే మాట్టే బ్లాక్ కలర్ జీ63 ఏఎంజీ కారు చూడవచ్చు. అయితే అందులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి.. ఆ కారు సూర్యకుమార్ యాదవ్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు. కాబట్టి కనిపించే కారు ‘సూర్యకుమార్ యాదవ్’కు చెందినదా? కాదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

వీడియోలో కనిపించే కారు మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ యొక్క గ్రాండ్ ఎడిషన్ అని తెలుస్తోంది. ఈ ఎడిషన్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కాగా ఈ కారును భారతదేశానికి కేవలం 25 మాత్రమే కేటాయించారు. ఈ ఎడిషన్ గత ఏడాదే మార్కెట్లో అడుగుపెట్టింది.

బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్.. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇది గోల్డ్ గ్రాఫిక్స్ కూడా పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క బంపర్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, స్పేర్ వీల్ రింగ్ మరియు సీట్ స్టిచింగ్ వంటివన్నీ కూడా గోల్డ్ యాక్సెంట్స్ పొందింది. కారు లోపలి భాగం కూడా గ్రాండ్ ఎడిషన్ బ్యాడ్జ్ పొందుతుంది. నప్పా లెదర్ సీట్లు ఇందులో ఉన్నాయి.

ప్రత్యేకంగా కనిపించే ఈ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్.. అద్భుతమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అయితే ఇది స్టాండర్డ్ ఎడిషన్ యొక్క అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 4.0 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 585 పీఎస్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ ఇతర కార్లు

క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్ కొనుగోలు చేశారా? లేదా? అనే విషయం మీద ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేలా కొనుగోలు చేసి ఉంటే.. ఈయన గ్యారేజిలో మరో బెంజ్ కారు చేరినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సూర్యకుమార్ గ్యారేజిలో ‘మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్’ (Mercedes Benz GLS) లగ్జరీ కారును కలిగి ఉన్నారు. ఈ కారును సంవత్సరం క్రితం ఆయన భార్య దేవిషా శెట్టితో కలిసి డెలివరీ తీసుకున్నారు.

మెర్సిడెజ్ బెంజ్ కార్లు మాత్రమే కాకుండా.. సూర్యకుమార్ యాదవ్ గ్యారేజిలో నిస్సాన్ జొంగా 1 టన్ పికప్ ట్రక్ కూడా కలిగి ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని మాదిరిగానే ఈయన కూడా కస్టమైజ్డ్ పికప్ ట్రక్కును కలిగి ఉన్నారు. ఇది కైనెటిక్ ఎల్లో లేదా నియాన్ గ్రీన్ షేడ్‌లో చూడముచ్చటగా ఉంది.

Don’t Miss: ఆటో ఇండస్ట్రీ మొత్తం ఈ 14 కంపెనీల కిందే! మీకు నచ్చిన కారు ఎక్కడుందో చూసుకోండి

భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ జీ63 కలిగిన ఇతరులు

సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాకూండా.. శ్రేయాస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, ఎంఎస్ ధోని వంటి ఇండియన్ క్రికెటర్లు కూడా బెంజ్ జీ63 కారును కలిగి ఉన్నట్లు సమాచారం. క్రికెటర్లు మాత్రమే కాకుండా.. రణబీర్ కపూర్, జాన్వీ కపూర్, రోహిత్ శెట్టి, సారా అలీ ఖాన్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, అమ్రితా అరోరా, దుల్కర్ సల్మాన్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ సెలబ్రిటీల వద్ద కూడా ఈ జీ63 ఏఎంజీ కారు ఉన్నట్లు తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు