హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

Interesting Facts About Hindupur MLA Balakrishna Bentley Car: ముద్దుగా NBK లేదా బాలయ్యగా పిలుచుకునే నట సింహ ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు బిడ్డగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తనదైన నటనతో.. ఆహార్యంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే, అది మొత్తం ఆయన ఘనత అనే చెప్పాలి.

ఈ రోజు బాలయ్యకు ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే బాలయ్య గురించి తెలిసిన చాలామందికి ఆయన ఉపయోగించే ఖరీదైన కారు గురించి బహుశా తెలిసిన ఉండకపోవచ్చు. ఈ కథనంలో బాలయ్య ఉపయోగించే ఖరీదైన కారు ఏది? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT)

నందమూరి బాలకృష్ణ ఉపయోగించే ఖరీదైన కార్లలో ఒకటి బెంట్లీ కంపెనీకి చెందిన ‘కాంటినెంటల్ జీటీ’. యూకే బ్రాండ్ అయిన ఈ కారు ధర భారతీయ మార్కెట్లో రూ. 4 కోట్ల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారును బాలయ్య కూతురు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు ‘నారా బ్రహ్మణి’ బాలకృష్ణ పుట్టినరోజు గిఫ్ట్‌గా అందించినట్లు సమాచారం. ఈ ఖరీదైన కారును మన దేశంలో చాలా తక్కువమంది మాత్రమే ఉపయోగిస్తారు. అందులో మన బాలయ్య ఒకరు కావడం గమనార్హం.

ఇక బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు విషయానికి వస్తే.. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ముందు భాగంలో హెడ్‌లైట్, బోనెట్ మీద బ్రాండ్ లోగో, అద్భుతమైన సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ కూడా చాలా అందంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ కారణంగానే ఇది చూడగానే ప్రజలను ఆకర్షిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. అత్యంత ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారులో వాహన వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, మై బెంట్లీ కనెక్టెడ్ సర్వీస్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని పొందటానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్

బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ట్విన్ టర్బో 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 550 పీఎస్ పవర్ మరియు 2000 – 4500 rpm వద్ద 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 4 .0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ గంటకు 318 కిమీ. దీన్ని బట్టి చూస్తే ఇది అత్యుత్తమ పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకూండా ఉత్తమ భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇలాంటి అత్యుత్తమ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, పొలిటికల్ లీడర్స్ ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

MLAగా బాలయ్య జీతం ఎంతంటే?

నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ జీతం రూ. 1.25 లక్షలు మాత్రమే. ఇతర అలవెన్సులు క్రింద రూ. 50000 (హెచ్ఆర్ఏ), సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు మాత్రమే కాకుండా.. సెక్యూరిటీ కింద గన్‌మెన్‌లను పొందవచ్చు. ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం ఎంఎల్ఏ కాబట్టి ఈయన జీతం రూ. 1.25 మాత్రమే అని తెలుస్తోంది. నిజానికి ఒక ఎంఎల్ఏ జీతం కంటే ప్రతిపక్షం నేతలు లేదా ఎంఎల్సీ జీతాలే కొంత ఎక్కువగా ఉంటాయి.

Don’t Miss: వింతగా ఉన్నా అందరి మనసు దోచేస్తోంది!.. ఆనంద్ మహీంద్రా చెంతకు ‘బుజ్జి’

చూడటానికి పెద్ద మీసాలతో సింహం మాదిరిగా కనిపించినప్పటికీ.. బాలయ్య మనసు బంగారం అని సన్నిహితులు చెబుతారు. కోపమొస్తే కొడతాడు, ప్రేమ వస్తే దగ్గరకు తీసుకుంటారు బాలయ్య. కెమెరా ముందు అయినా, కెమెరా వెనుక అయిన బాలయ్య అంటే బాలయ్యే అంటారు. ఎందుకంటే రెండు స్వభావాలు బాలయ్యకు లేవు. ఏం చేయడానికైనా అదరడు, బెదరడు.. అందుకే అంటారు ఆయన్ను అందరూ జై బాలయ్య..