Interesting Facts About Kalki 2898 AD Bujji: ఇప్పటి వరకు సాధారణ బైకులు చూసుంటారు, కార్లను చూసుంటారు. అంతెందుకు విచ్చల విడిగా మాడిఫైడ్ చేసిన మోడిఫైడ్ వాహనాలను కూడా చూసి ఉంటారు. అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ వాహనం.. న భూతో న భవిష్యతి మాదిరిగా ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వెహికల్ పేరు ఏంటి? ఇది ఎక్కడ తయారైంది? దీని ప్రత్యేకలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు సంబందించి తాజాగా ఓ కొత్త టీజర్ లాంచ్ అయింది. ఇందులో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన వాహనం డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీని పేరు ‘బుజ్జి’ (Bujji). పేరు బుజ్జి అయినా.. పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇది ఏఐ పవర్డ్ మెషిన్ అని తెలుస్తోంది.
బుజ్జి వెహికల్.. ఒకప్పటి బ్యాట్‌మ్యాన్ యొక్క బాట్మొబైల్, ఐరన్ మ్యాన్ యొక్క జార్విస్ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. బుజ్జి ఎలా ఉంటుందో మీరే ఊహించేయవచ్చు. ఈ ప్రత్యేకమైన వాహనం అభిమానులను తెగ ఫిదా చేసేస్తోంది. ఇది ఓ యుద్ధ భూమి లాంటి ప్రదేశంలో చేసే విన్యాసాలు అంతా.. ఇంతా కాదు. టీజర్ చూస్తే మీకే అర్థమైపోతుంది.
‘బుజ్జి’ ఎక్కడ తయారైందంటే?
కల్కి సినిమాలో కనిపించే బుజ్జి.. ఏ జర్మన్ దేశంలోనో.. జపాన్ దేశంలోనో తయారు కాలేదు. మన ఇండియాలోనే.. తమిళనాడులోని కోయంబత్తూరులో తయారైంది. దీని బరువు ఏకంగా 6 టన్నులు, కాగా దీన్ని తయారు చేయడానికి రూ.7 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ వెహికల్ చూడటానికి ప్రత్యేకంగా కనిపించడానికి.. చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. దీని ముందు భాగంలో రెండు పెద్ద టైర్లు, వెనుక భాగంలో ఒకే పెద్ద టైరు ఉంటుంది. ముందు కనిపించే టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచెస్ కాగా.. పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ మరియు ఎత్తు 2186 మిమీ వరకు ఉంది. ఈ వాహనాన్ని డ్రైవ్ చేయడానికి ప్రత్యేకమైన స్టీరింగ్ వీల్ కూడా లభిస్తుంది. పైన ఒక గ్లాస్ బాడీ ఉంది. ఇందులో డ్రైవ్ చేసే వ్యక్తి కూర్చోవడానికి ఓ సీటు కూడా ఉంది. ఇది 47 కిలోవాట్ బ్యాటరీ కలిగి మంచి పనితీరును అందిస్తుంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఈ ప్రత్యేకమైన వాహనాన్ని మహీంద్రా మరియు జయం మోటార్స్ కలిసి రూపొందించారు. ఈ వాహనం చూసిన తరువాత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు. ఇందులో చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా టీమ్ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ మరియు ఆర్కిటెక్చర్ మరియు పర్ఫామెన్స్ అనుకరించడం ద్వారా ఫ్యూచరిస్టిక్ తయారైంది. కల్కి బృందానికి సాయం చేసింది. ఇక ఆట ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ నటించిన ఈ కల్కి 2898 ఏడీ సినిమా టీజర్లో కనిపించిన బుజ్జి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతోంది. ప్రభాస్ భైరవ పాత్రలో బుజ్జిని యుద్ధభూమిలో తన వ్యూహాలకు మద్దతు ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద టీజర్ చాలా ఆసక్తిగా సాగటం చూడవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో కనిపించే క్యారెక్టర్ వేషంలో టీజర్ లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో అన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టీజర్ లాంచ్ చేయడానికి ముందే ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. తన జీవితంలోకి ఎవరో స్పెషల్ రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోజు (మే 23) ఆ స్పెషల్ రానే వచ్చేసింది.
Don’t Miss: టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారేమో!
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి అగ్ర తారలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న తెరమీదకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సినిమా మంచి హిట్ సాధిస్తుందని భవిస్తున్నాము.