Allu Arjun Mitsubishi Pajero in Push 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలుసు. ఇక ‘పుష్ప 2’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో విడుదలకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీ వల్లి (రష్మిక మందన్న) నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పత్రాలు పోషిస్తున్న ఈ మూవీ సినిమా కోసం ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్ కేటాయించింది. తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్లల్లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ మాత్రమే కాకుండా.. పాటలకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. ఇకపోతే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉపయోగించే కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఈ కారు పేరు ఏంటి? దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్లలో కనిపించిన కారు పేరు ‘మిత్సుబిషి పజెరో’ (Mitsubishi Pajero). ఇది జపాన్ కంపెనీకి చెందిన కారు. ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు ప్రస్తుతం అక్కడక్కడా అరుదుగా కనిపిస్తోంది.
‘మిత్సుబిషి పజెరో’ చరిత్ర
1934లో జపాన్ ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ కారు.. తరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ తరువాత 1978లో పజెరో II పేరుతో పరిచయమైనప్పటికీ.. 1981 టోక్యో మోటార్ షోలో మొదటి ఉత్పత్తిని ప్రదర్శించారు. 1982 నుంచి ఇది అమ్మకాలని మార్కెట్లోకి వచ్చేసింది. ఇలా మార్కెట్లోకి మిత్సుబిషి పజెరో అడుగుపెట్టింది.
మిత్సుబిషి పజెరో ప్రారంభంలో గొప్ప అమ్మకాలను సాధించగలిగింది. ఆ తరువాత ఇది ల్యాండ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది. ఆ తరువాత అమ్మకాలు కొంత మందగించడం మొదలైంది. ఆ తరువాత కాలక్రమంలో ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. దీంతో 2021లో ఈ కారు ఉత్పత్తి నిలిచిపోయింది. నాలుగు తరాలు మార్కెట్లో మనుగడ సాగించిన ఈ కారు ఎంతోమంది వాహన ప్రేమికులకు ఇష్టమైన మోడల్.
ధర
దేశీయ మార్కెట్లో మిత్సుబిషి పజెరో విక్రయానికి లేదు. కానీ ఇది భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న సమయంలో దీని ధర రూ. 18 లక్షల కంటే ఎక్కువని సమాచారం. అయితే ఇప్పుడు ఈ కారు ‘మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్’ పేరుతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. దీని ధర రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉంది.
మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు.. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. మిత్సుబిషి పజెరో సెవెన్ సీటర్ కారు. ఇది కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఇందులో ఉండేవి. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉండటం వల్ల.. ఈ కారు వాహన వినియోగదారులు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేది.
మిత్సుబిషి పజెరో రోజు వారీ వినియోగనికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కంపెనీ దీనికి తగిన విధంగా ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ అందించింది. కాబట్టి దీంతో ఆఫ్-రోడింగ్ ప్రియులు ఆఫ్-రోడింగ్ అనుభూతిని పొందవచ్చు. అన్ని విధాలా అనుకూలంగా ఉండే ఈ కారు కేవలం.. ప్రత్యర్థులను తట్టుకోలేక అమ్మకాల్లో వెనుక పడింది. ఈ కారణంగానే దీని ఉత్పత్తి నిలిచిపోయింది.
Don’t Miss: టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారేమో!
మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్
నాలుగు తరాలు ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచిన మిత్సుబిషి పజెరో.. ఆధునిక హంగులతో పజెరో స్పోర్ట్స్ రూపంలో థాయిలాండ్, ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా దేశాల్లో అమ్ముడవుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మిత్సుబిషి కంపెనీకి చెందిన కార్లు భారతదేశంలో విక్రయానికి లేదు. బహుశా కంపెనీ రాబోయే రోజుల్లో కూడా మనదేశంలో కార్లను లాంచ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.