నెపోలియన్, అనుకున్నది ఒక్కటి ఐయినది ఒక్కటి, ఏడ తానున్నాడ, నేను సీతాదేవి.. లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్. ఇప్పుడు శశివదనే అనే మంచి రొమాంటిక్ సినిమాతో మన ముందుకు వస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన సినిమా పాత్రికేయులతో సమావేశంలో కొన్ని సినిమా మరియు వ్యక్తిగత విషయాలను కోమలి మీడియాతో ముచ్చటించింది.
డాక్టర్ అయ్యుండి.. సినిమాల్లోకి ఎందుకొచ్చానంటే?
మీరు డాక్టర్ అయ్యుండి సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? అని శశివదనే ప్రెస్‌మీట్‌లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు.. కోమలి ప్రసాద్ సమాధానం ఇస్తూ.. మాములుగా నేను క్లాసికల్ డ్యాన్స్‌తో ఆరంగేట్రం చేశాను, డ్యాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాకపొతే అప్పుడు మా ఫాదర్ నీకు ఫ్యాషన్ ఏమున్నా కూడా.. ఎడ్యుకేషన్ పూర్తి అయినా తరువాతే అని చెప్పారు. ఎందుకంటే ఎడ్యుకేషన్‌కు ఆయన చాలా విలువ ఇస్తారు కాబట్టి అని చెప్పుకొచ్చారు. అందుకే నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేశాకే యాక్టింగ్‌లోకి రావడం జరిగిందని హీరోయిన్ కోమలి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
మతం ఏదైనా ఉంటే అది ప్రేమే
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పర్సనల్‌గా ప్రేమను చాలా నమ్ముతాను. నాకు మతం ఏదైనా ఉంటే అది ప్రేమే. అబ్బాయిని అమ్మాయి మోసం చేయడం, అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం అనేది జెండర్‌ను బట్టి ఏమి ఉండదు. మనుషులు చెడ్డవాళ్ల మంచివాళ్ల అనేదాన్ని బట్టే ఏ ప్రేమైన ఉంటుందని.. సినిమాలో తన పాత్ర కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమగల గోదావరి జిల్లాల అందమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీలు తక్కువ అయిన తరుణంలో మేము గనుక హిట్ అయితే అదే ట్రెండ్ ఆవుతుంది అని కోమలి మాట్లాడారు.
నటి కోమలి ప్రసాద్ గురించి
కోమలి ప్రసాద్ 1995 ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించినప్పటికీ.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో పెరిగారు. ఈమె అహ్మద్‌నగర్‌లోని.. ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బీడీఎస్ (డెంటిస్ట్) పూర్తిచేసిన తరువాత.. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమాల్లోకి నటిగా ప్రవేశం చేశారు.
సినిమా ప్రస్థానం ఇలా..
మొదట నేను సీతాదేవి అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తరువాత ఒక్కొక్కటిగా నెపోలియన్, హిట్ (ది ఫస్ట్ కేస్), అనుకున్నది ఒకటి అయినది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీ.సీ 524, హిట్ ది సెకండ్ కేస్, హిట్ థర్డ్ కేస్ సీక్వెల్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే లూజర్, మోడర్న్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. తనకు ఒకేలాగా ఉండే పాత్రలు చేస్తూ వెళ్లడం ఇష్టం లేదని, విభిన్నమైన, విలక్షణమైన కథలు, క్యారెక్టర్స్ చేయడం అంటే.. నాకు చాలా ఉత్సహంగా ఉంటుందని శశివదనే ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చారు. అదే సందర్బంగా ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయని, ఇంటిల్లపాది కూర్చుని చూసే మూవీ ఇదని.. అక్టోబర్ 10న కుటుంబం అంతా కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.