ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసిన యాపిల్: ధరలు, బుకింగ్స్ & పూర్తి వివరాలు

ప్రతి ఏటా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేయడం.. అదే సమయంలో ఇతర ఉత్పతులను కూడా పరిచయం చేయడం జరుగుతున్న విషయమే. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ‘అవే డ్రాపింగ్‘ కార్యక్రమంలో సరికొత్త ‘ఐఫోన్ 17‘ లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ సిరీస్ ధరలు ఎలా ఉన్నాయి?, ఫీచర్స్ ఏంటి?, ఎప్పటి నుంచి అమ్మకానికి వస్తాయి? అనే చాలా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

వేరియంట్స్ & ధరలు

యాపిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. అవి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమాక్స్. ఇవి కాస్మిక్ ఆరంజ్, డీప్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 12 నుంచి స్వీకరించడం మొదలు పెడుతుంది. సేల్స్ ఇదే నెల 19 నుంచి ప్రారంభమవుతాయి.

➤ఐఫోన్ 17: రూ. 82,900
➤ఐఫోన్ 17 ఎయిర్: రూ. 1,19,900
➤ఐఫోన్ 17 ప్రో: రూ. 1,34,900
➤ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్: రూ. 1,49,900

ఐఫోన్ 17

మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర రూ. 82,900. బ్లాక్, లావెండర్, సగే, వైట్, మిస్ట్ బ్లూ అనే ఐదు రంగులలో లభించే ఈ ఫోన్ 6.3 ఇంచెస్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఇరువైపులా సిరామిక్ షీల్డ్ కలిగి.. స్క్రీన్‌కు మూడు రెట్లు మెరుగైన నిరోధకతను అందిస్తుంది. 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 40 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలి ఫోటో లెన్స్ మొదలైనవి పొందుతుంది. ప్రారంభ స్టోరేజ్ కెపాసిటీ 256 జీబీ. ఇది ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 17 ఎయిర్

యాపిల్ లాంచ్ చేసిన మరో ఐఫోన్ 17 సిరీస్ వేరియంట్.. ఎయిర్. దీని ధర రూ. 1,19,900. ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ చాలా పల్చగా ఉంటుంది. దీని మందం 5.6 మిమీ మాత్రమే. 6.5 ఇంచెస్ డిస్‌ప్లే కలిగిన ఈ వేరియంట్.. బ్లాక్, వైర్, గోల్డ్ అండ్ బ్లూ అనే నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. ఇరువైపులా సిరామిక్ షీల్డ్ కలిగి సుమారు 80 శాతం రీసైక్ల్డ్ టైటానియంతో ఈ ఫోన్ తయారైంది. ఇది 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్, 18 మెగాపిక్సెప్ సెంటర్ స్టేజ్ కెమెరా వంటివి పొందుతుంది. కాబట్టి మంచి ఫోటో షూట్ అనుభూతిని పొందవచ్చు.

ఐఫోన్ 17 ప్రో & ప్రో మ్యాక్స్

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ టాప్ మోడల్స్ అయిన వీటి ధరలు వరుసగా.. రూ. 1,34,900 & రూ. 1,49,900. థర్మల్ మేనేజ్మెంట్ సిస్టం కలిగిన ఈ ఫోన్స్.. సాధారణ మోడల్స్ మాదిరిగా వేడెక్కవు. ఈ రెండూ కూడా సిరామిక్ షీల్డ్ పొందుతాయి. వెనుక వైపు మూడు కెమెరాలతో వచ్చే ఈ ఫోన్స్.. మొదటిసారి 48 మెగాపిక్సెల్ పొందాయి. 17 ప్రో 6.3 ఇంచెస్ డిస్‌ప్లే పొందింది. 17 ప్రో మ్యాక్స్ 6.9 ఇంచెస్ డిస్‌ప్లే పొందింది.

వాచ్ సిరీస్ 11

కంపెనీ అవే డ్రాపింగ్ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్స్ ప్రో3 కూడా లాంచ్ చేసింది. 100 శాతం రీసైకిల్డ్ అల్యూమినియంతో రూపొందించబడిన ఈ స్మార్ట్‌వాచ్‌లు లెక్కకు మించిన ఫీచర్స్ పొందుతాయి. ఈసీజీ, హైబీపీ అలర్ట్, స్లీపింగ్ స్కోర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 46,900.

ఎయిర్‌పాడ్స్ ప్రో3

ఇక చివరగా యాపిల్ లాంచ్ చేసిన సరికొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో3 విషయానికి వస్తే.. వీటి ప్రారంభ ధర రూ. 25,900. ఇవి రీడిజైన్డ్ లిక్విడ్ గ్లాస్ యూఐతో రూపిందించబడ్డాయి. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ ఎయిర్‌పాడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. త్వరలోనే వీటి బుకింగ్స్, సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

Leave a Comment