అరుంధతిగా శ్రీలీల?: జేజమ్మగా మెప్పిస్తుందా!

అనుష్క నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలుసు. ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ మూవీ ఒక సంచలనమే. నటి అనుష్కకు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమాల జాబితాలో ఇది చెప్పుకోదగ్గది. ఇలాంటి సినిమాను.. ఇప్పుడు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ సినిమాను ఏ భాషలో రీమేక్ చేయనున్నారు?, ఎవరు రీమేక్ చేయనున్నారు?, నటి ఎవరు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందీలో రీమేక్!

అరుంధతి సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది.. అనుష్క. అంతగా నటించి ప్రేక్షకులను మెప్పించగలిగింది. అరుంధతి సినిమా రిలీజ్ సమయంలో.. ఈ సినిమాను రీమెక్ చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే.. ఇప్పుడు (పదహారేళ్ళ తరువాత) ఈ సినిమాను హిందీలో రీమెక్ చేయాలని నిర్ణయించుకున్నారు. రీమేక్స్ చేయడంలో నిష్ణాతుడైన మోహన్ రాజా అరుంధతిని రీమేక్ చేయనున్నారు.

అరుంధతిగా శ్రీలీల?

మోహన్ రాజా రీమేక్ చేయనున్న అరుంధతి సినిమా కోసం ఎవరిని తీసుకుంటున్నారు?, ఈ క్యారెక్టర్ ఎవరు చేయనున్నరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమనేది స్పష్టంగా తెలియదు. అంతే కాకుండా అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. బహుశా అరుంధతి పాత్రను పండించాలంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి.

రిలీజ్ ఎప్పుడంటే?

నిజానికి మోహన్ రాజా సినిమా రీమేక్ చేస్తున్నారంటే.. అది తప్పకుండా సూపర్ హిట్ సాధిస్తుందని నమ్మకం. కాబట్టి అలాంటి వ్యక్తి అరుంధతి సినిమా రీమేక్ చేస్తున్నారు అంటే.. చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియదు. బహుశా వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.

అరుంధతి సినిమా గురించి

నటి అనుష్క అంటేనే ముందుగా.. చాలామందికి గుర్తొచ్చే సినిమా అరుంధతి. సుమారు 50 కంటే ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ.. మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం అరుంధతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో గొప్ప విజయం సాధించిన ఈ సినిమా.. భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, సుమారు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకుంది.

ఈ సినిమాలో అనుష్క, సోనూసూద్, సాయాజీ షిండే, మనోరమ, కైకాల సత్యనారాయణ, దివ్య నగేష్ మొదలైనవారు నటించారు. 2009లోనే ఈ సినిమాకు సుమారు రూ. 13.5 కోట్లు ఖర్చు పెడితే.. రూ. 40 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు చేసినట్లు సమాచారం. అంతటి హిట్ సాధించిన ఈ సినిమాను రీమేక్ చేస్తే.. ఎలా ఉంటుంది? ఎంత కలెక్షన్స్ రాబట్టుకోగలుగుతుంది? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా.. ఈ రీమేక్ అరుంధతి సినిమా కోసం శ్రీలీలనే తీసుకుంటారా?, లేక హీరోయిన్ ఎంపికలో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కూడా ప్రస్తుతానికి సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలిపోయింది.

Leave a Comment