లగ్జరీ కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ.. కారు రేటు ఎంతంటే?

Jabardasth Rithu Chowdary Buys New Toyota Innova Hycross: వెండితెర సెలబ్రటీలు, బుల్లితెర నటులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ఇటీవల జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ‘రీతూ చౌదరి’ (Rithu Chowdhary) తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ రీతూ కొన్న కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నుంచి జబర్దస్త్ షో..

నిజానికి ఒకప్పుడు చిన్న ఇంటర్వ్యూల ద్వారా పరిచయమైనా రీతూ.. ఆ తరువాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది. చేతికి అందిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని కస్టపడి ఎదిగిన రీతూ చౌదరికి జబర్దస్త్ షో మంచి ఫేమ్ ఇచ్చింది. ఆ తరువాత రీతూ అంటే అందరికి సుపరిచయమైంది. ఆ తరువాత అవకాశాలు ఈమెనే వెతుక్కుంటూ వచ్చాయి. చిన్న స్థాయి నుంచి ఎదిగి ఓ పాపులర్ నటిగా ఎంతోమందికి ఆదర్శమైన రీతూ చౌదరి ఇప్పుడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.

రీతూ చౌదరి కొత్త కారు

బుల్లితెర నటి రీతూ చౌదరి కొనుగోలు చేసిన కారు టయోటా కంపెనీకి చెందిన ‘ఇన్నోవా హైక్రాస్’. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర లాంచ్ సమయంలో రూ. 18.30 లక్షలు, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 28.97 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ కారు యొక్క ఆన్ రోడ్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే రీతూ చౌదరి ఏ మోడల్ కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు.

ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ప్రారంభంలో కారు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్ పూర్తి చేసి, ఆ తరువాత కారు మీద ఉన్న గుడ్డను తొలగిస్తారు. ఆ తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి.. డీలర్ నుంచి కారు కీ తీసుకుంటుంది. ఆ తరువాత కారును డ్రైవ్ చేస్తూ వెళ్లడం చూడవచ్చు.

రీతూ చౌదరి షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కొత్త కారు కోన్ రీతూకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో ఫ్యాన్స్ మాత్రమే కూడా కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కష్టపడి ఎదిగి ఓ మంచి కారుకు రీతూ చౌదరి ఓనర్ అయిపోయింది.

సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న రీతూ చౌదరికి.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సీరియల్స్‌లో నటిస్తూ.. సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేస్తూ ఈ అమ్మడు బిజీగా కాలం గడిపేస్తోంది. రాబోయే రోజుల్లో రీతూ సినిమాల్లో కూడా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికోసం అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్

ఇక టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) విషయానికి వస్తే.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, మాట సిల్వర్ ఇన్‌సర్ట్స్, డీఆర్ఎల్, టర్న్ ఇండికేటర్స్ మొదలైనవి పొందుతుంది. ఇన్నోవా కిస్టా మాదిరిగా కాకుండా ఈ కారు గ్లాస్‌హౌస్‌ పొందుతుంది. వెనుక రూప్ మోంటెడ్ స్పాయిలర్, ఛంకీ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు బ్లాక్ అవుట్ రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద ఇది ఇన్నోవా క్రిష్టా కంటే కూడా ఆధునికంగా ఉంటుంది.

టయోటా హైక్రాస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద 10.1 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్, దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఏసీ వెంట్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇన్నోవా హైక్రాస్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్. హైబ్రిడ్ వెర్షన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ యూనిట్. ఇది 184 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. నాన్ హైబ్రిడ్ వెర్షన్ 1987 సీసీ ఇంజిన్ ద్వారా 172 హార్స్ పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే పొందుతాయి. హైబ్రిడ్ వెర్షన్ 23.24 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 16.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

Don’t Miss: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా యొక్క ఇన్నోవా హైక్రాస్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ మరియు టాటా సఫారీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ ఈ కారు దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.