అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయమే అవసరం లేదు. నాలుగేళ్ల వయసులోనే.. సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె.. 13ఏళ్ల నాటికే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. సుమారు 300 సినిమాలలో నటించిన శ్రీదేవి.. ఎంతమంది అభిమానుల మనసు దోచుకుందో.. ఎన్ని అవార్డులను సొంతం చేసుకుందో చెప్పడం కొంత అసాధ్యమే. అయితే తల్లికి వచ్చిన ఫేమ్.. తనయ (కుమార్తె) ‘జాన్వీ కపూర్‘ కు రావడం లేదు.
జాన్వీ కపూర్ 21 సంవత్సరాలకు హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించిది. అప్పటి నుంచి పెద్ద బ్లాక్ బస్టర్స్ అందుకోలేదు. తెలుగు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర కూడా అంతంత మాత్రమే అనిపించింది. అయితే ఇటీవల పరమ సుందరి సినిమాలో.. సుందరి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తన తల్లి నటించిన సినిమానే రీమేక్ చేయనున్నట్లు.. అందులో జాన్వీ కపూర్ కనిపించనున్నట్లు సమాచారం.
చాల్‌బాజ్ సినిమా రీమేక్
నటి శ్రీదేవి నటించిన ‘చాల్‌బాజ్‘ సినిమా గొప్ప హిట్ అందుకుంది. ఆ సినిమానే ఓ ప్రముఖ నిర్మాత రీమేక్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. జాన్వీకి చాల్‌బాజ్ కేవలం సినిమా మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. తన తల్లి నటించిన సినిమాలో జాన్వీ నటించే అవకాశం రావడం గొప్ప విషయం అని కొందరు చెబుతున్నారు. ఈ సినిమాను జాగ్రత్తగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కొన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ.. సెప్టెంబర్ చివరి నాటికి ఓ నిర్ణయం ఫైనల్ అవుతుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కనిపించనుంది. ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ చూడని జాన్వికి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా?, లేదా అనేది.. సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రిలీజ్ తేదీలో ఏదైనా మార్పులు ఉన్నాయా?, లేదా.. అనేది కూడా రానున్న రోజుల్లో తెలుస్తుంది.
జాన్వీ కపూర్ గురించి
శ్రీదేవి.. బోనీ కపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న జన్మించారు. ఈమె ముంబైలోని ఏకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకుంది. జాన్వీ సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు.. కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది. ఈ కోర్సు పూర్తయిన తరువాత 2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్‘లో మొదటిసారి కనిపించింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించిన ఈమె.. మొదటిసారి దేవర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించింది. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తోంది.
జాన్వీ కపూర్ పొందిన అవార్డులు
సినిమాల్లో తల్లి మాదిరిగానే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. అనేక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇందులో.. లోక్‌మత్ స్టైలిష్ అవార్డు, జీ సినీ అవార్డు, పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డు, పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డు మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా.. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు, బాలీవుడ్ హంగామా స్టైల్ అవార్డు మొదలైనవికి నామినేట్ అయింది.