Jeep Wrangler Facelift Launched in India: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికన్ బ్రాండ్ ‘జీప్’ (Jeep) దేశీయ విఫణిలో ‘రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్’ (Wrangler Facelift) అనే కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, ఇతర పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర, వేరియంట్స్ & బుకింగ్స్ (Price, Variants & Bookings)
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్’ (Jeep Wrangler Facelift) ప్రారంభ ధర రూ. 67.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 67.65 లక్షలు మరియు 71.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే రూ. 5 లక్షలు ఎక్కువ. కంపెనీ ఇప్పటికే ఈ కారు 100 కంటే ఎక్కువ ఫ్రీ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
డిజైన్, కలర్ ఆప్షన్ (Design, Colour Options)
జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క అన్‌లిమిటెడ్ వేరియంట్ బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. రూబికాన్ వేరియంట్ బ్లాక్ కలర్ ఫ్రంట్ గ్రిల్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫ్రంట్ విండ్ షీల్డ్ గొరిల్లా గ్లాస్‌తో తయారుచేయబడి ఉంటుంది.
కొత్త రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఫైర్‌క్రాకర్ రెడ్, సార్జ్ గ్రీన్, బ్రైట్ వైట్, బ్లాక్ మరియు గ్రానైట్ క్రిస్టల్ కలర్స్. ఇంతకు ముందు అన్‌లిమిటెడ్ వేరియంట్‌లో సర్జ్ గ్రీన్ అనే కలర్ ఆప్షన్ కూడా ఉండేది. మొత్తం మీద ఇవన్నీ చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్ తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకోవచ్చు.
ఫీచర్స్ (Features)
జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది జీప్ యొక్క యూకనెక్ట్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. డాష్‌బోర్డ్ డిజైన్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది.అంతే కాకుండా 12వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఇందులో లభ్సిట్యుయి.
ఇంజిన్ (Engine)
2024 జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇందులో అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 266 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.
సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)
మంచి డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగిన కొత్త ‘జీప్ రాంగ్లర్’ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మరియు ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
ప్రత్యర్థులు (Rivals)
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 2024 జీప్ రాంగ్లర్ ధర కొంత ఎక్కువ అయినప్పటికీ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.
Don’t Miss: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది
ఇండియన్ మార్కెట్లో జీప్ కంపెనీ వాహనాలకు అధిక ప్రజాదరణ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే రాంగ్లర్ అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ చేసింది. ఈ కారు చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా.. వినియోగదారులకు అంతకు మించిన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. దేన్నీ బట్టి చూస్తే ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.