JSW MG Motor Delivers Over 100 Windsor EVs On A Single Day: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది అన్న విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేడు ఓ చిన్న కంపెనీ నుంచి దిగ్గజ కంపెనీ వరకు అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసి.. ఈ విభాగంలో తమ హవా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన కారే ఎంజీ మోటార్ మరియు జేఎస్డబ్ల్యు యొక్క ‘విండ్సర్ ఈవీ’. ప్రారంభం నుంచి ఆశాజనక అమ్మకాలను పొందుతున్న ఈ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ధనత్రయోదశి సందర్భంగా ఒకేసారి 100 కార్లను డెలివెరీ చేశారు.
ఒకేసారి 100 డెలివరీలు
దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో లేదా ధన త్రయోదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ కారణంగానే ఇటీవల ఢిల్లీ వాసులు సుమారు 100మంది విండ్సర్ ఈవీ కార్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మెగా ఈవెంట్ డెలివరీ కూడా డీలర్షిప్ అధికారులు నిర్వహించారు. ఒకేసారి వంద కార్ల డెలివరీ అంటే.. ప్రజలకు విండ్సర్ మీద ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఢిల్లీ కొంత ముందంజలో ఉంది. డిసెంబర్ 2023లోనే ఈవీల సేల్స్ ఏకంగా 19.5 శాతం పెరిగాయి. దేశరాజధానిలో ఈవీల సేల్స్ పెరగడానికి ఢిల్లీ ఈవీ పాలసీ చాలా దోహదపడిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఎంజీ మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి ఉనికిని చాటుకుంటోంది. ఈవీ విభాగంలో ఎంజీ మోటార్స్ జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఇవే మరియు విండ్సర్ ఈవీ అనే మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.
ఎంజీ కామెట్ ఈవీ
దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ప్రసిద్ధిచెందిన ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ చిన్నగా కనిపించే 2 డోర్స్ హ్యాచ్‌బ్యాక్. ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్న ఈ కారులో నాలుగు కూడా ప్రయాణించవచ్చు. వివిధ రంగులలో లభించే ఈ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి 230 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 41.4 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.3 కేడబ్ల్యు ఛార్జర్ సాయంతో 7 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ
నిజానికి ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ కారు అంటే ముందుగా అందరికి గుర్తొచ్చే కారు జెడ్ఎస్ ఈవీ. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న మోడల్ 2024 మార్చిలో లాంచ్ అయింది. దీని ధర రూ. 22 లక్షల నుంచి రూ. 25.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రీఫ్రెష్డ్ ఫ్రంట్ బంపర్, టెయిల్ లైట్స్ కలిగిన ఈ కారు.. 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ బ్లూటూత్ కీ, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
జెడ్ఎస్ ఈవీ 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 461 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది. ఈ కారు 176 Bhp పవర్ మరియు 353 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారు కలిగి ఉంటుంది. ఇది 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా హుందాగా ఉంటుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ
ఇటీవల ఎంజీ మోటార్ మరియు జేఎస్డబ్ల్యు కలియికతో.. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన విండ్సర్ ఈవీ ఎక్కువ అమ్మకాలను పొందగలుగుతోంది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన 24 గంటల్లోనే 15,176 బుకింగ్స్ పొందగలిగింది. విండ్సర్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంజీ విండ్సర్ కారు ప్యూర్ ఈవీ ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైట్ బార్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, ప్లస్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అవుట్ సి మరియు డి పిల్లర్స్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్ వంటి మరెన్నో.. ఈ కారులో ఉన్నాయి.
15.6 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 8.8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 9 స్పీకర్ సౌండ్ సిస్టం, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఏరో లాంజ్ బై ఎంజీ అని పిలువబడే సీట్లు 135 డిగ్రీల వరకు వంగి ఉంటాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన MG Windsor EV: సింగిల్ ఛార్జ్ 331 కిమీ రేంజ్
ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఐపీ67 రేటెడ్. ఈ కారులో 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ చేత ధృవీకరించబడింది.
గతంలో 101 విండ్సర్ కార్ల డెలివరీ
ఢిల్లీలో వంద కార్లను ఒకేసారి డెలివరీ చేయడం గొప్ప విషయమే. అయితే ఒక్కసారి 100 కార్లను డెలివరీ చేయడం అనేది ఇదే మొదటిసారి కాదు. దసరా సందర్భంగా కూడా ఎంజీ జూబిలెంట్ డీలర్‌షిప్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఒకేసారి 101 విండ్సర్ కార్ల డెలివరీ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డెలివరీ 2024 అక్టోబర్ 26న జరిగింది.