తమిళనాడు అత్యున్నత పురస్కారానికి ఎంపికైన సాయి పల్లవి: జాబితా రిలీజ్!

అత్యున్నత పౌరపురస్కారాలలో ఒకటిగా పరిగణించే కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం.. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డును ఎవరెవరు పొందనున్నారు?, ఎంతమంది పొందనున్నారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

కలైమామణి అవార్డుకు ఎంపికైన సాయి పల్లవి

సాయి పల్లవి, ఎస్‌జే సూర్య, విక్రమ్ విక్రమ్ ప్రభు, జయ వీసీ గగనాథన్, కే మణికందన్, ఎం జార్జ్ మొదలైనవారు.. కలైమామణి అవార్డులను పొందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (2025 సెప్టెంబర్ 24) వెల్లడించింది. దీనికి సంబంధించి వివిధ వర్గాలలో ఎవరెవరు ఈ అవార్డు తీసుకోకున్నారో కూడా జాబితా వెల్లడించింది.

జాబితాలో ఇతర ప్రముఖులు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉన్నవారు.. వివిధ కళలు, వివిధ నేపధ్యాల కిందకు వచ్చే అనేకమంది కళాకారులు ఉన్నారు. వీరంతా.. తమిళనాడు సాంస్కృతిక వారసత్వానికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

కలైమామణి అవార్డులకు ఎంపికైన జాబితాలో యాక్టర్స్ మాత్రమే కాకుండా.. వివిధ సాంకేతిక నిపుణులు, చిత్ర కార్మికులు సైతం ఉన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్, చిత్ర నిర్మాత ఎస్ లింగుస్వామి, స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, నేపథ్య గాయని శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండీ మొదలైనవారు ఉన్నారు.

విజేతలుగా ప్రకటించిన 90మంది కళాకారులలో.. సాహిత్యంలో భారతియార్ అవార్డుకు రచయిత ఎన్. మురుగేశ పాండియన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డుకు ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు, బాలసరస్వతి అవార్డుకు పద్మశ్రీ ముత్తుకన్నమ్మల్ ఎంపికయ్యారు. ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కల్చర్ డైరెక్టరేట్ విభాగం అయిన.. ఇయాల్ ఇసై నాటక మండ్రం అందజేస్తుంది. ఈ అవార్డులను అక్టోబర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ప్రధానం చేయనున్నారు.

వివిధ విభాగాల్లో 2021 సంవత్సరం విజేతలు

➤నటి: సాయి పల్లవి
➤నటుడు: ఎస్‌జే సూర్య
➤డైరెక్టర్: లింగుసామి
➤యాక్షన్ కొరియోగ్రాఫర్: స్టంట్ సుబ్బరాయన్

2020 సంవత్సర విజేతలు

➤నటి: జయ గుహనాథన్
➤నటుడు: విక్రమ్ ప్రభు
➤గీత రచయిత: వివేక్
➤ప్రో కన్సల్టెంట్: డైమండ్ బాబు
➤ఫోటోగ్రాఫర్: టీ లక్ష్మీకాంతన్

2023 సంవత్సర విజేతలు

➤అనిరుధ్ రవిచందన్: సంగీత స్వరకర్త
➤శ్వేతా మోహన్: గాయకుడు
➤కే మణికందన్: నటుడు
➤జార్జ్ మరియన్: నటుడు

కలైమామణి అవార్డు గురించి

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 1954లో కలైమామణి అవార్డులను ప్రారంభించింది. కళారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంది. 2020 వరకు ఈ అవార్డులను అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను వచ్చే నెలలో అవార్డులను ప్రధానం చేయడానికి సంకల్పించింది. సినిమా రంగానికి మాత్రమే కాకుండా.. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకాలు, ఇతర కళలకు ఈ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డును ప్రధానం చేసే సమయంలో అవార్డు గ్రహీతలకు మెమోరాండం, మెడల్ మాత్రమే కాకుండా కొంత నగదు బహుమతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. బహుశా ఇందులో ఏమైనా మార్పులు చేసారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ అవార్డుకు ఎంపికైన వారికి అక్టోబర్ 2025లో అవార్డును ప్రధానం చేయనున్నారు.