ఆలా మొదలైంది ఫేస్‌బుక్‌లో రిషబ్ శెట్టి లవ్‌స్టోరీ.. పేరెంట్స్ వద్దన్నా పెళ్లి చేసుకున్నారు

రిషబ్ శెట్టి కన్నడ స్టార్ అయినప్పటికీ.. తెలుగు ప్రజలకు కూడా సుపరిచయమే. దీనికి కారణం కాంతారా సినిమా కావొచ్చు, జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుభందం కూడా కావొచ్చు. ఏదైతే ఏం.. తెలుగు ప్రజల హ్యూదాయాలకు చేరువయ్యారు. అయితే రిషబ్ ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేస్తూ.. ప్రేమించి ప్రగతి శెట్టి (రిషబ్ శెట్టి భార్య)ని పెళ్లి చేసుకున్న విషయం బహుశా చాలామందకి తెలియదు. ఈ కథనంలో ఆ విషయాలు తెలుసుకుందాం.

పెళ్ళికి ముందు ఐటీ ఉద్యోగం చేసిన ప్రగతి శెట్టి.. రిషబ్ శెట్టితో పెళ్లి జరిగిన తరువాత తన ఫోకస్ మొత్తం కాస్ట్యూమ్ డిజైన్ మీదనే ఉంచింది. రేపు రిలీజ్ కానున్న కాంతారా చాప్టర్-1 సినిమాకు కూడా ఈమే కాస్యూమ్ డిజైన్ కావడం చెప్పుకోదగ్గ విషయం. హీరోయిన్ అంత అందం ఉన్నప్పటికీ.. అనుకువతో రిషబ్ బాటలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ జంటకు (రిషబ్, ప్రగతి) ఇద్దరు పిల్లలు ఉన్నాయి.

ఫేస్‌బుక్ కలిపింది ఇద్దరిని

ఇక ప్రేమ విషయానికి వస్తే.. ఒక కార్యక్రమంలో అనుకోకుండా కలిసిన ప్రగతి, రిషబ్ ఆ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తరువాత ఫేస్‌బుక్ ద్వారానే చాటింగ్ చేసుకుని ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి విషయానికి వచ్చే సమయానికి ప్రగతి తల్లిదండ్రుల అభ్యంతరం చెప్పారు. దీనికి కారణం అప్పటికి రిషబ్ శెట్టి సినిమాల్లో అంతగా నిలదొక్కుకోలేకపోవడమే. కానీ ప్రగతి మొండి పట్టుతో ప్రేమించిన.. రిషబ్ శెట్టిని 2017లో పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే ఫేస్‌బుక్ ఈ జంటను కలిపిందనే చెప్పాలి.

పెళ్లి తరువాత ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే.. ప్రగతి కాస్యూమ్ డిజైన్ వర్క్ కూడా చేస్తోంది. ఇటీవల జరిగిన కాంతారా చాప్టర్-1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి, తమ కుటుంబంతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు అన్నయ్య అని కూడా వేదికపై చెప్పింది.

రిషబ్ & జూనియర్ ఎన్టీఆర్‌ల అనుబంధం

నిజానికి ఇద్దరు అగ్ర సినిమా హీరోలు స్నేహితులుగా మాత్రమే కాకుండా.. అన్నదమ్ములుగా కలిసి ఉండటం చాలా అరుదు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. కన్నడ సినిమా రంగంలో రిషబ్ శెట్టికి కూడా అంత క్రేజ్ ఉంది. అయితే వీరిరువుకు చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. రిషబ్ శెట్టి గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను స్వయంగా కర్ణాటకలోని చాలా దేవాలయాలకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కాంతారా చాప్టర్-1 సినిమా ప్రీరిలీజ్ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్‌ను సోదర సమానుడని అన్నాడు. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా రిషబ్ శెట్టి గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. కాంతారా సినిమా కోసం రిషబ్ బాగా కష్టపడ్డాడని, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని కోరారు.

కాంతారా చాప్టర్-1 విషయానికి వస్తే..

నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఘన విజయం సాధించిన తరువాత.. కాంతారా చాప్టర్-1 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినీమా కూడా మంచి విజయం సాదిస్తుందని, చాలామంది భావిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరాం మొదలైనవారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.