30.2 C
Hyderabad
Thursday, April 3, 2025

రూ.1.5 కోట్ల కారు కొన్న అలనాటి తార.. ఫోటోలు చూశారా?

Karishma Kapoor Mercedes Benz: సినీ ప్రపంచంలో ‘కరిష్మా కపూర్’ గురించి తెలియని వారు ఉండరు. ఈమె ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన ఆ లగ్జరీ కారు ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన జర్మన్ బ్రాండ్ లగ్జరీ కారు పేరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450. దీని ధర రూ. 1.5 కోట్లు. ఈ కారును ఉపయోగించడానికంటే ముందు ఈమె ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారులో తిరుగుతూ కనిపించేది. ఇప్పుడు బెంజ్ కారును కొనుగోలు చేయడంతో ఈ కారులో కనిపించింది.

కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుకు కూడా.. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ కారుకు మాదిరిగానే, అదే 7774 వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి ఉండటం చూడవచ్చు. అంటే ఈమె తన బెంజ్ కారు కోసం కూడా ఈ వీఐపీ నెంబర్ కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా ఇది ఆమె లక్కీ నెంబర్ అని కూడా అర్థమవుతోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన బెంజ్ కారు పోలార్ వైట్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు.. ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ (Mercedes Benz GLE 450 4MATIC) కారు ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అదే పరిమాణంలో ఉండే ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్, హ్యాండ్ ఫ్రీ పార్కింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, లెదర్ ర్యాప్డ్ సీట్లు, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

Also Read: టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

నటి కరిష్మా కపూర్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ యొక్క టాప్ వేరియంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కాబట్టి ఇది 3.0 లీటర్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 365 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 245 పీఎస్ పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్స్ మంచి పనితీరును అందిస్తాయని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కార్లను కలిగిన సెలబ్రిటీలు

నటి కరిష్మా కపూర్ మాత్రమే కాకుండా.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారును కొనుగోలు చేశారు. ఈ జాబితాలో టెలివిజన్ నటి మోనా సింగ్, బాలీవుడ్ స్టార్ ఫాతిమా సనా షేక్, సాయి తమ్‌హంకర్, రిచా చద్దా, బోమన్ ఇరానీ మరియు సోహా అలీ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.

సినీతారలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి కారణం

నిజానికి లగ్జరీ కార్లంటే ఎవ్వరికైనా ఇష్టమే. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా లగ్జరీ కార్లు వ్యక్తి యొక్క స్టేటస్ తెలియజేస్తాయి. ఈ కారణంగానే పలువురు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొంత తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేసి రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న సంగతి మరచిపోకూడదు. సింపుల్ లైఫ్ గడపడంలో భాగంగానే డబ్బు ఉన్నప్పటికీ.. వాహనాలు కోసం వీరు ఎక్కువ డబ్బు వెచ్చించరు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు