DK Shivakumar College Days Yezdi Roadking Bike: బైక్ లేదా కారు అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి పనికొచ్చే ఒక యంత్రం మాత్రమే కాదు. అదొక జ్ఞాపకం, ఇంకా చెప్పాలంటే ఒక ఎమోషన్. చాలామంది తాము కాలేజీలకు వెళ్లిన బైకులు లేదా ఫస్ట్ బైకును ఇప్పటికి కూడా జ్ఞాపకార్థంగా తమవద్దే ఉంచుకున్నారు. ఇలాంటి సెంటిమెంట్ కేవలం సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రమే కాకుండా.. ప్రముఖుల జీవితాల్లో కూడా ఉంటాయి. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ బైక్ ఫోటోలు షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షేర్ చేసిన పోస్టులో గమనిస్తే యెజ్డీ బైక్ చూడవచ్చు. ఇది చూడటానికి కొత్తగా కనిపిస్తున్నప్పటికీ.. డీకే శివకుమార్ కాలేజ్ డేస్ సమయంలో ఉపయోగించిన బైక్ అని తానే స్వయంగా పేర్కొన్నారు. నిజానికి ఇది రీస్టోర్డ్ బైక్. డీకే శివకుమార్ రిస్టోర్ బైక్ పక్కన నిలబడి ఉండటం, బైక్ కిక్ స్టార్ట్ చేయడం వంటివి గమనించవచ్చు. ఇవన్నీ డీకే శివకుమార్ నివాసంలో జరిగినట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్ ఏమన్నారంటే?
కాలేజీ రోజులు బైక్ క్రేజ్ అనేది సర్వసాధారణం. నా కాలేజీ రోజుల్లో ఈ బైక్ తెగ వాడేసాను. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇది నిర్జీవ దశలో ఉంది. దీనిని వింటేజ్ బైక్ ప్రేమికుడు సుప్రీత్.. మళ్ళీ కొత్తదానిలా రూపొందించారు. ఈ బైక్ ఎన్నో జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకుతెస్తుంది. అని డక్ శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.
యెజ్డీ రోడ్‌కింగ్ (Yezdi Roadking)
దశాబ్దాల ముందు టూ వీలర్ విభాగంలో సంచలనం సృష్టించిన ‘యెజ్డీ రోడ్‌కింగ్’ చాలామందికి ఇష్టమైన బైక్. ఇది ఐడియల్ బ్రాండ్ జావా లిమిటెడ్ చేత తయారు చేయబడింది. 1970లలో యెజ్డీ బైక్ భారతీయ మార్కెట్లో ప్రవేశించింది. అప్పట్లోనే అమ్మకాల్లో ఓ మెరుపు మెరిసిన ఈ బైక్ యువకులకు ఇష్టమైన మోడల్‌గా ప్రసిద్ధి చెందింది.
సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ అనుకూలమైన సీటు, క్రోమ్ ఎగ్జాస్ట్ మరియు టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందినట్లు తెలుస్తోంది. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ మీద నిర్మించబడిన ఈ బైక్ నిర్వహణకు కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఈ కారణంగానే చాలామంది రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ వంటి వాటికి విరివిగా ఉప్పగించేవారు.
యెజ్డీ రోడ్‌కింగ్.. 250 సీసీ సింగిల్ సిలిండర్ టూ స్ట్రోక్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18 బీహెచ్‌పీ పవర్ మరియు 24 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ కూడా ఎయిర్ కూల్డ్ అండ్ ట్విన్-ఫోర్డ్ ఎగ్జాస్ట్ సిస్టం కలిగి ఉంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందించేది. అప్పట్లో ఈ బైక్ కేవలం కిక్ స్టార్ట్ ఆప్షన్ మాత్రమే పొందింది. సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఉండేది కాదు.
ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ రెండూ కూడా బైక్ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉండేవి. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందించేవి. ఈ బైక్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పొందింది. కాబట్టి ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉండేది. ఇవన్నీ యువకులను ఈ బైక్ తెగ ఆకర్శించింది. అమ్మకాల్లో కూడా ఇది ఆశాజనకంగానే ఉండేది.
Don’t Miss: భారత్‌లో ఫస్ట్ డెలివరీ.. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు ఇదే! ఇంకా స్పెషల్ ఏంటంటే?
పాతకాలపు బైకులపై ఎందుకంత క్రేజు
డీకే శివకుమార్ మాత్రమే కాకుండా.. చాలామందికి పాతకాలపు బైకులంటే చాలా ఇష్టం. ఇందులో మహేంద్ర సింగ్ ధోని వంటి వారు కూడా ఉన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా రీస్టోర్డ్ బైకులు విరివిగానే అందుబాటులో ఉన్నాయి. దశాబ్దాల కాలం గడిచిపోయినా.. వీటిపైన ఉన్న మక్కువ తగ్గిపోకుండా ఉండటానికి కారణం వాటితో వారికున్న అనుభందం అనే చెప్పాలి. మన మధ్యలో కూడా ఇలాంటి పాతకాలపు బైకులను కలిగి ఉన్నవారు చాలామందే ఉంది ఉంటారు.