Kia EV9 Launched in India: సౌత్ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ (Kia Motors) ఎట్టకేలకు తన ఈవీ9 (EV9) ఎలక్ట్రిక్ కారును భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.
వేరియంట్స్ మరియు ధరలు
కొత్త ప్రీమియం కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు జీటీ-లైన్ ఏడబ్ల్యుడీ 6 సీటర్ అనే ఓకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ధర 1.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
కలర్ ఆప్షన్స్ మరియు డిజైన్
కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP) ఆధారంగా రూపొందించబడింది. ఇది స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాన్తేరా మెటల్ మరియు అరోరా బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.
ఈవీ9 పొడవు 5015 మిమీ, వెడల్పు 1980 మిమీ, వీల్‌బేస్ 3100 మిమీ, ఎత్తు 1780 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులోని 20 ఇంచెస్ స్పోర్టీ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్, రియర్ వైపర్, రూప్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్ మొదలైనవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి.
ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్
కియా ఈవీ9 సిక్స్ సీటర్ లేఅవుట్‌తో మాత్రమే లభిస్తుంది. క్యాబిన్ వైట్/బ్లాక్ లేదా బేజ్/బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెథెరెట్ అపోల్స్ట్రే, స్వెడ్ హెడ్‌లైనర్, ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయెల్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ కోసం మెమొరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మొదలైనవి పొందుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా ఈవీ9 కారులో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్‌బిల్ట్ న్యావిగేషన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ ఆప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ కీ, 14 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్, 360 డిగ్రీ కెమెరా మరియు 50:50 స్ప్లిట్ ఫోల్డ్ మరియు రిక్లైన్ ఫంక్షన్ వంటివి ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్
అత్యధిక రేంజ్, కొత్త డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ ఎంత ముఖ్యమో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కారులో అంతే ముఖ్యం. కాబట్టి కియా ఈవీ9 కారులో కంపెనీ 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్, సైడ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు డిస్క్ బ్రేక్స్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.
బ్యాటరీ మరియు రేంజ్
ఈవీ9 కారులో కంపెనీ 99.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కూడా 383 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ అందిస్తాయి. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 350కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 24 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.
Don’t Miss: లాంచ్‌కు ముందే దుమ్ములేపిన బుకింగ్స్!.. కియా కార్నివాల్‌పై పెరుగుతున్న మోజు
భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే అమ్మకాల పరంగా దేశంలో ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ ఈక్యూఎస్, ఈక్యూఈ, బీఎండబ్ల్యూ ఐఎక్స్ మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.