KTM New Bikes Launched in India: యువతను తన బైకులతో ఎంతగానో ఆకట్టుకునే ‘కేటీఎమ్’ (KTM) ఒకేసారి ఏకంగా 10 బైకులను మార్కెట్లో లాంచ్ చేసింది. ఒకదాన్ని మించి.. మరొకటి చూపరులను ఎంతగానో కనువించు చేస్తున్నారు. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..
కంపెనీ లాంచ్ చేసిన బైకులు:
- కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్
- కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్
- కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్
- కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్
- కేటీఎమ్ 50 ఎస్ఎక్స్
- కేటీఎమ్ 65 ఎస్ఎక్స్
- కేటీఎమ్ 85 ఎస్ఎక్స్
- కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్
- కేటీఎమ్ 450 ఎస్ఎక్స్-ఎఫ్
- కేటీఎమ్ 350 ఈఎక్స్‌సీ-ఎఫ్
కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ (KTM 1290 Super Adventure)
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ 1290 సూపర్ అడ్వెంచర్. దీని ధర రూ. 22.74 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). లాంచ్ రైడ్ చేయడానికి లేదా కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి దీనిని కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రస్తుతం సింగిల్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తున్న ఈ బైక్.. బెంగళూరు మరియు పూణేలలో మాత్రమే విక్రయానికి ఉంది.
Also Read: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే
23 లీటర్ల ఫ్యూయెల్ త్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ 1301 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద 160 హార్స్ పవర్, 6500 rpm వద్ద 138 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముందు భాగంలో 320 మిమీ డ్యూయెల్ డిస్క్ సెటప్, వెనుక 267 మిమీ డిస్క్ ఇందులో అమర్చబడి ఉన్నాయి.
కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్ (KTM 1390 Super Duck R)
కంపెనీ లాంచ్ చేసిన బైకులలో అత్యంత ఖరీదైన బైక్ ఈ 1390 సూపర్ డ్యూక్ ఆర్. దీని ధర రూ. 22.96 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ప్రస్తుతం కేటీఎమ్ యొక్క అత్యంత శక్తివంతమైన బైక్ ఏది అంటే.. 1390 సూపర్ డ్యూక్ ఆర్ అనే చెప్పాలి. ఇది డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్, బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ (KTM 890 Duke R)
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ ధర రూ. 14.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 889 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది బెంగళూరు, పూణేలలోని కేటీఎమ్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే కంపెనీ ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి అవుతుందని తెలుస్తోంది.
కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ (KTM 890 Adventure R)
కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ 890 అడ్వెంచర్ ఆర్. దీని ధర రూ. 15.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ, బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ బైక్.. బరువు 200 కేజీలు. దీనిని కంపెనీ ప్రధానంగా ఆఫ్ రోడింగ్ కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఒక మిడ్ సైజ్ అడ్వెంచర్ బైక్.
కేటీఎమ్ డర్ట్ బైక్స్ (KTM Dirt Bikes)
ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ ఆరు డర్ట్ బైకులను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 50 ఎస్ఎక్స్. దీని ధర రూ. 4.75 లక్షలు. ఈ విభాగంలో లాంచ్ అయిన ఇతర బైకుల విషయానికి వస్తే.. అవి కేటీఎమ్ 65 ఎస్ఎక్స్ (రూ. 5.47 లక్షలు), 85 ఎస్ఎక్స్ (రూ. 6.69 లక్షలు), 250 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 9.58 లక్షలు), 450 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 10.25 లక్షలు), 350 ఈఎక్స్‌సీ-ఎఫ్ (రూ. 12.96 లక్షలు).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఇండియా.
Also Read: ఒబెన్ రోర్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!
కేటీఎమ్ డర్ట్ బైకులలో మూడు ప్రత్యేకంగా యువకులను దృష్టిలో ఉంచుకుని లాంచ్ అయ్యాయి. అవి కేటీఎమ్ 50 ఎస్ఎక్స్, 65 ఎస్ఎక్స్, 85 ఎస్ఎక్స్. ఇవి టూ స్ట్రోక్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి మంచి పనితీరును అందిస్తాయి. సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ మూడు బైకుల బరువు కూడా చాలా తక్కువే.
మరో మూడు (కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్, 450 ఎస్ఎక్స్-ఎఫ్ మరియు 350 ఈఎక్స్‌సీ-ఎఫ్) డర్ట్ బైకులను కంపెనీ ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేసింది. ఇవన్నీ మొదటి మూడు డర్ట్ బైకుల కంటే ఉత్తమ పనితీరును అందిస్తాయి. అయితే వీటి బరువు కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇవి అత్యుత్తమ బైకులు అని చెప్పాల్సిందే.