ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న Land Rover కొత్త కారు – ధర ఎంతో తెలుసా?

Land Rover Launches Range Rover Sport SV: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘ల్యాండ్ రోవర్’ (Land Rover) ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొత్త వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త ఉత్పతులను లాంచ్ చేయడంలో భాగంగా.. ఇప్పుడు సరికొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sports) లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో సుమారు సంవత్సర కాలం కంటే ఎక్కువ రోజులుగా విక్రయించబడుతున్న ల్యాండ్ రోవర్ ఇప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV పేరుతో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. డెలివరీలు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price)
  • రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV – రూ. 2.80 కోట్లు
  • రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV ఆటోబయోగ్రఫీ – రూ. 2.11 కోట్లు

రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఇంజిన్ (Engine)

కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 ఇంజిన్ పొందుతుంది. ఇది 635 హార్స్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 290 కిమీ వరకు ఉంటుంది.

డిజైన్ (Design)

కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV మంచి డిజైన్ కలిగి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్ష్మ మార్పులను గమనించవచ్చు. ఇందులో విస్తృతంగా ఉండే ఫ్రంట్ అండ్ రియర్ ట్రాక్స్, పెరిగిన క్యాంబర్, కొత్త ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్ ట్రీట్‌మెంట్, సైడ్ స్కర్ట్స్ మరియు డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో కూడిన రియర్ బంపర్ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ (Interior)

రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇంటిగ్రేటెడ్ హెడ్ నియంత్రణలతో కూడిన కొత్త సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. డ్రైవ్ మోడ్‌ను యాక్టివేట్ చేయడానికి ఇందులో బటన్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మిగిలిన చాలా ఫీచర్స్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV

దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త రేంజ్ రోవర్ PHEV 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ కలిగి 38.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. మొత్తం సిస్టం 460 హార్స్ పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 225 కిమీ కావడం గమనార్హం.

Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV 7 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా ఐదు గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఇందులోని 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ వేరియంట్లో డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, వెంటిలేషన్ మరియు మసాజ్‌తో కూడిన 22 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ప్రత్యర్థులు (Rival)

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ SV భారతీయ మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆడి ఆర్ఎస్ క్యూ8 మరియు ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి ఇతర సూపర్ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV వేరియంట్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు.