Mahindra Scorpio Boss Edition Launched: అసలే పండుగ సీజన్.. కొత్త కార్లు కొనాలనుకునే వారి ఈ సంశయం కోసమే వేచి చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కస్టమర్లను తమవైపు ఆకర్శిచుకోవడానికి కంపెనీలు తమదైన రీతిలో సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఉన్న కార్లనే ఆధునిక హంగులతో లాంచ్ చేసి స్పెషల్ ఎడిషన్ అని పేరు పెడుతున్నాయి. ఇవి స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra and Mahindra) ఇప్పుడు తన స్కార్పియో క్లాసిక్ కారును నలుపు రంగులో లాంచ్ చేసింది. దీనికి ‘బాస్ ఎడిషన్’ అని పేరు పెట్టింది.
మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ (Mahindra Scorpio Boss Edition)
కంపెనీ లాంచ్ చేసిన మహీంద్రా బాస్ ఎడిషన్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ప్రత్యేకింగ్ ఈ కారు యొక్క బయట మరియు లోపలి భాగాల్లో డార్క్ క్రోమ్ యాక్ససరీస్ ఉన్నాయి. వెలుపలి భాగంలోని సాధారణ క్రోమ్ యాక్సెంట్స్ ముదురు రంగులో ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్ హోసింగ్ అన్నీ కూడా బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతాయి.
బానెట్ స్కూప్, హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్, ఫెండర్ ఇండికేటర్స్ మరియు రియర్ క్వార్టర్ గ్లాస్ కూడా డార్క్ క్రోమ్ ట్రీట్‌మెంట్ పొందుతున్నాయి. రెయిన్ వైజర్స్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ మరియు బ్లాక్ పౌడర్ కోటింగ్‌తో రియర్ గార్డ్ ఉన్నాయి. ఇందులో రివర్స్ కెమెరా కూడా ఉండటం చూడవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ బ్లాక్ సీట్ అపోల్స్ట్రే మరియు నేక్ పిల్లోస్, బ్యాక్ కుషన్స్ వంటి వాటితో కూడిన కంఫర్ట్ కిట్ కూడా పొందుతుంది. అయితే ఈ కింద అనేది టాప్ వేరియంట్‌కు మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కార్పియో ధరలు రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కాబట్టి క్లాసిక్ బాస్ ఎడిషన్ దారి స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.
ఇంజన్‌లో అప్డేట్ ఉందా?
మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ కాస్మొటిక్ డిజైన్స్ పొందినప్పటికీ.. ఇంజిన్ విషయంలో ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 130 Bhp పవర్ మరియు 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు.
స్కార్పియో సేల్స్ ఎలా ఉన్నాయి
నిజానికి భారతదేశంలో మహీంద్రా యొక్క స్కార్పియో కార్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన సమయంలో కేవలం కొన్ని గంటల్లోనే భారీ బుకింగ్స్ పొందగలిగింది. ఒకప్పుడు మార్కెట్లో సంచలనం సృష్టించిన స్కార్పియో ఇప్పుడు సరికొత్త రూపంలో లాంచ్ అవడంతో చాలామంది దీనిని ఎగబడి గోనుగోలు చేశారు. ఇప్పటికి కూడా దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది.
మహీంద్రా స్కార్పియో చరిత్ర
ఇండియన్ మార్కెట్లో 2002 నుంచి మహీంద్రా స్కార్పియో అందుబాటులో ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్ కోసం నిర్మించిన మహీంద్రా యొక్క మొదటి మోడల్ కావడం గమనార్హం. ప్రారంభంలోనే ఎంతోమందిని ఆకర్శించిన ఈ కారు బిజినెస్ స్టాండర్డ్ మోటరింగ్ నుంచి ‘కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు, బీబీసీ వరల్డ్ నుంచి.. బెస్ట్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ మరియు బెస్ట్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది.
Don’t Miss: కొడుకు కోసం పాపులర్ కారు.. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ అంటే ఆ మాత్రం ఉంటది!
మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా స్కార్పియో కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. ఇందులో భాగంగానే ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కస్టమర్లను ఆకర్శించే డిజైన్ మరియు ఫీచర్స్ పొంది ఉండటమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందాయి. ఆ తరువాత స్కార్పియో.. క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ రూపంలో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ రెండు కార్లూ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.