60 నిమిషాల్లో 1.76 లక్షల బుకింగ్స్: భారీగా ఎగబడుతున్న జనం..

Mahindra Thar Roxx 1.76 Lakh Bookings First One Hour: గత ఆగష్టు 15న దేశీయ మార్కెట్లో అధికారికంగా డుగుపెట్టిన మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కంపెనీ బుకింగ్స్ ప్రారభవించిన కేవలం 60 నిమిషాల్లో ఏకంగా 1,76,218 మంది బుక్ చేసుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

60 నిమిషాల్లో 1.76 బుకింగ్స్

భారతదేశంలో మహీంద్రా థార్ యొక్క 3 డోర్ కారుకు కూడా ఇప్పటికీ బుకింగ్స్ తగ్గడం లేదు. కంపెనీ ఇంకా 3 డోర్ మోడల్ డెలివరీ చేయాల్సిన కార్లు ఇంకా ఉన్నాయి. ఈ తరుణంలో థార్ యొక్క 5 డోర్ వెర్షన్ యొక్క బుకింగ్స్ మరింత ఎక్కువగా ఉన్నాయి. అయితే థార్ రోక్స్ బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో డెలివరీ వెయిటింగ్ పీరియడ్ కొంత ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నాము. అయితే ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు దసరా రోజును ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కేవలం ఒక గంటలోనే 1.76 లక్షలమంది ఈ కారును బుక్ చేసుకోవడంతో.. బ్రాండ్ వాహనాల మీద ప్రజలకున్న నమ్మకానికి ధన్యవాదాలు అని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా డెలివరీలను కూడా వీలైనంత వేగంగా చేస్తామని వెల్లడించింది. అయితే డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

కొత్త మహీంద్రా థార్ చూడగానే సాధారణ 3 డోర్ మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే.. ఇది 5 డోర్ మోడల్ అని తెలిసిపోతుంది. పరిమాణంలో ప్రధానంగా మార్పును గమనించవచ్చు. 3 డోర్ వెర్షన్ కంటే కూడా 5 డోర్ పరిమాణం కొంత పెద్దదిగా ఉంటుంది.

మహీంద్రా థార్ రోక్స్ 19 ఇంచెస్ అల్లీ వీల్స్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటి వాటిని ఇందులో చూడవచ్చు. ఈ 5 సీటర్ మోడల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు, హర్మాన్ కార్టాన్ సౌండ్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్స్ థార్ రోక్స్ కారులో ఉన్నాయి.

మహీంద్రా థార్ రోక్స్ ఇప్పుడు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులను ప్రమాదం సమయంలో కాపాడటానికి ఉపయోగపడతాయి.

పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్

2024 మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమాటిక్ వెర్షన్ 177 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ 4×2 వేరియంట్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలో 152 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తాయి.

రోక్స్ 4×4 వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో 152 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో 175 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేసేది. కాబట్టి రెండు ఇంజిన్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. కాబట్టి కొనుగోలుదారులు పనితీరు గురించి సందేహించాల్సిన అవసరం లేదు.

Don’t Miss: మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?
థార్ రోక్స్ బుకింగ్స్ పెరగటానికి కారణం

మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ పెరగటానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రజలకు ఆఫ్ రోడింగ్ కార్ల మీద ఉన్న అమితమైన ఆసక్తి. థార్ కార్లు కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా కఠినమైన భూభాగాల్లో కూడా సజావుగా ముందుకు సాగుతుంది. పనితీరు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేసేలా చేస్తోంది.