Mahindra XUV 3XO Waiting Period: భారతదేశంలో మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంచుకంటే థార్ 3 డోర్ వెర్షన్, స్కార్పియో ఎన్ మరియు ఎక్స్‌యూవీ700 వంటి మోడల్ దేశీయ విఫణిలో లాంఛ్ అయిన వెంటనే ఎలాంటి అమ్మకాలు పొందాయో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra 3XO) కూడా గొప్ప బుకింగ్స్ పొందుతోంది. ఈ కారును డెలివరీ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలలు వేచి ఉండాల్సిందే అంటూ గణాంకాలు చెబుతున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారుకు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అయిన 3ఎక్స్ఓ ప్రతి నెల సగటున 9000 నుంచి 10000 యూనిట్ల బుకింగ్స్ పొందుతోంది. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. ఏ వేరియంట్ బుక్ చేస్తే.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనే వివరాలను ఈ కింద గమనించవచ్చు.
పెట్రోల్ వేరియంట్స్ వెయిటింగ్ పీరియడ్
ఎమ్ఎక్స్1 – 6 నెలలు
ఎమ్ఎక్స్2/ఎమ్ఎక్స్2 ప్రో – 3 నెలల నుంచి 4 నెలలు
ఎమ్ఎక్స్3/ఎమ్ఎక్స్3 ప్రో – 3 నుంచి 4 నెలలు
ఏఎక్స్5 – 4 నెలలు
ఏఎక్స్5 ఎల్ – 2 నెలల నుంచి 3 నెలలు
ఏఎక్స్7 – 2 నెలల నుంచి 3 నెలలు
ఏఎక్స్7 ఎల్ – 2 నెలల నుంచి 3 నెలలు
డీజిల్ వేరియంట్స్ వెయిటింగ్ పీరియడ్
ఎమ్ఎక్స్2/ఎమ్ఎక్స్2 ప్రో – 1 నెల
ఎమ్ఎక్స్3/ఎమ్ఎక్స్3 ప్రో – 1 నెల
ఏఎక్స్5 – 1 నెల
ఏఎక్స్7 – 1 నెల
ఏఎక్స్7 ఎల్ – 1 నెల
నివేదికల ప్రకారం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ యొక్క బేస్ వేరియంట్ ఎమ్ఎక్స్1 బుక్ చేసుకుంటే.. డెలివరీ పొందటానికి కనీసం 6 నెలలు వేచి చూడాల్సి ఉంది. అదే సమయంలో ఎమ్ఎక్స్2 లేదా ఎమ్ఎక్స్2 ప్రో మరియు ఎమ్ఎక్స్3 లేదా ఎమ్ఎక్స్3 ప్రో అనే పెట్రోల్ మోడల్స్ బుక్ చేసుకుంటే 3 నెలల నుంచి 4 నెలల సమయం వేచి చూడాలి. ఇందులో డీజిల్ వెర్షన్ బుక్ చేసుకుంటే ఒక నెల రోజులు ఎదురు చూడాల్సి ఉంది.
ఏఎక్స్5 పెట్రోల్ వేరియంట్ కోసం నాలుగు నెలలు, ఏఎక్స్5 ఎల్ పెట్రోల్ మోడల్ కోసం 2 నుంచి 3 నెలలు వేచి చూడాలి. అదే సమయంలో ఏఎక్స్7 డీజిల్ మోడల్ కోసం 1 నెల.. పెట్రోల్ మోడల్ కోసం గరిష్టంగా 2 నుంచి 3 నెలలు వేచి చూడాలి. టాప్ వేరియంట్ అయిన ఏఎక్స్7 ఎల్ పెట్రోల్ కోసం కూడా 2 నుంచి 3 నెలలు.. డీజిల్ వేరియంట్ కోడం 1 నెల రోజులు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఎక్స్‌యూవీ 3ఎక్స్0 బేస్ మోడల్ బుక్ చేసుకున్నవారు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ గురించి
ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు తొమ్మిది వేరియంట్లలో.. పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి పనితీరు పరంగా ఈ కారు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ప్రారంభ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 7.49 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధరలు రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.
సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇందులో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 111 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 131 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ మరియు 117 హార్స్ పవర్ విడుదల చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ కలిగి ఉంటే.. డీజిల్ ఇంజిన్ మాత్రం 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలను పొందుతుంది.
Don’t Miss: ‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?
భారతదేశంలో అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులను ప్రమాద సమయంలో కొంత సురక్షితంగా ఉంచడానికి పనికొస్తాయి.