Mahindra XUV400 Pro Launched: భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఇప్పటికే XUV400 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అంమ్మకాలను పొందుతోంది. అయితే రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ‘XUV400 ప్రో’ మోడల్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్ల ధరలు, బుకింగ్ వివరాలు, డెలివరీ వంటి వాటికి సంబంధించిన మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
వేరియంట్స్, బ్యాటరీ, ఛార్జర్ మరియు ధరలు (Variants and Price )
- XUV400 EC Pro – 34.5 కిలోవాట్ బ్యాటరీ – 3.3 kW AC ఛార్జర్ – రూ. 15.49 లక్షలు
- XUV400 EL Pro – 34.5 కిలోవాట్ బ్యాటరీ – 7.2 kW AC ఛార్జర్ – రూ. 16.74 లక్షలు
- XUV400 EL Pro – 39.5 కిలోవాట్ బ్యాటరీ – 7.2 kW AC ఛార్జర్ – రూ. 17.49 లక్షలు
బుకింగ్స్ మరియు డెలివరీ (Bookings and Delivery)
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా XUV400 ఈవీ మోడల్ బుకింగ్స్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుతం కంపెనీ వెల్లడించిన ధరలు 2024 మే 31 వరకు మాత్రమే వర్తిస్తాయి.
డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)
కొత్త మహీంద్రా XUV400 ఈవీ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొత్త 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఏసీ వెంట్స్ అవుట్‌గోయింగ్ మోడల్‌లో మాదిరిగా సైడ్‌లో కాకుండా కింద ఉండటం గమనించవచ్చు. ఇది మాత్రమే కాకుండా HVAC కంట్రోల్ కూడా మధ్యలో ఉన్నాయి.
లోపల ఇంటీరియర్ మొత్తం బ్లాక్ అండ్ లేత గోధుమరంగులో డ్యూయల్ టోన్ థీమ్‌లో కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా కొత్త ఫ్లాట్-బాటమ్ యూనిట్, అయితే ఇన్‌స్ట్రుమెంట్ బినాకిల్ మాత్రం మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ, అనలాగ్ డయల్స్ స్థానంలో సరికొత్త 10.25 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ ఉంది.
2024 మహీంద్రా XUV400 ఈవీలో 7.0 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్ మాత్రమే కాకుండా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా కనెక్టివిటీ, రియర్ USB పోర్టులు మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ కెమెరాలు వంటివి ఉన్నాయి.
బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)
కొత్త మహీంద్రా XUV400 ఈవీ యాంత్రికంగా ఎటువంటి మార్పులకు గురి కాలేదు, కాబట్టి ఇందులో అదే 34.5 కిలోవాట్ బ్యాటరీ, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఉన్నాయి. ఇవి వరుసగా 375 కిమీ మరియు 456 కిమీ రేంజ్ అందిస్తాయని తెలుస్తోంది. EC ప్రో మోడల్ 3.3 kW ఛార్జర్ మాత్రమే పొందుతుంది, EL ప్రో వేరియంట్లు 39.4 kW బ్యాటరీ పొందుతుంది. ఈ రెండు మోడల్స్ 150 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతాయి.
Don’t Miss: Mercedes Benz: రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా కార్లకు భారతదేశంలో ఓ ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అత్యద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా మహీంద్రా కార్లలో నిక్షిప్తమై ఉంటాయి. కాగా ఇప్పటికే విపరీతమైన అమ్మకాలు పొందుతున్న మహీంద్రా XUV400 ఈవీను ప్రో వేరియంట్ రూపంలో విడుదల చేయడం వల్ల కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి ద్రుష్టిని ఆకర్శించగలదని భావిస్తున్నాము. కాబట్టి ఈ మోడల్ తప్పకుండా ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలదని ఆశిస్తున్నాము.