Man Celebrates Bike Birthday Video Goes Viral: పుట్టిన రోజు అనేది సాధారణంగా మనుషులే జరుపుకుంటారు. అయితే జంతు ప్రేమికులు లేదా పక్షులను ప్రేమించేవారు.. వాటికి కూడా బర్త్‌డే చేసి తెగ మురిసిపోతుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొందరు బైక్‌కు బర్త్‌డే చేస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? బైక్‌కు బర్త్‌డే ఎందుకు చేశారు అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. కొందరు వ్యక్తులు బైకును బాగా శుభ్రం చేసి దానికి పూల మాల వేసి ఉండటం చూడవచ్చు. ఆ బైక్ ముందు టైరుకు కేక్ కట్ చేయడానికి కట్టిన కట్టి ఉండటం కూడా గమనించవచ్చు. దానికి ముందు మరో వ్యక్తి చేతిలో కేక్ పట్టుకున్నారు. బైకును పట్టుకున్న వ్యక్తి దానిని ముందుకు నెట్టడం ద్వారా కేట్ కట్ చేయడం జరుగుతుంది. ఈ వేడుకకు ఓ కుటుంబం మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 17 లక్షల కంటే ఎక్కువమంది దీనిని లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరు బైకుకు పుట్టిన రోజు చేసిన వ్యక్తిని అభినందిస్తుంటే.. మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
బైకుపై ఆ వ్యక్తికి ఉన్న మమకారం చాలా గొప్పదని, అతని క్రియేటివిటీ అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు. మరికొందరు సైలెన్సర్ ఉపయోగించి క్యాండిల్స్ వెలిగించి ఉండొచ్చు కదా అని చమత్కరించారు. మనిషి తనకు నచ్చిన వస్తువునైనా ఎంత జాగ్రత్తగా.. ఎంత ప్రేమగా చూసుకుంటాడో అనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు.
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor+)
ఇక్కడ వీడియాలో కనిపించే బైక్ హీరో మోటోకార్ప్ యొక్క స్ప్లెండర్ ప్లస్ అని తెలుస్తోంది. ఈ బైకుకు భారతదేశంలో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్న ఈ బైక్ ఎక్కువ మైలేజ్ అందించే ద్విచక్ర వాహనాల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ బైక్ ప్రారంభ ధరలు రూ. 74155 మాత్రమే (ఎక్స్ షోరూమ్).
హీరో స్ప్లెండర్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లు.. ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 97.2 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 8000 rpm వద్ద 7.91 Bhp పవర్ మరియు 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది లీటరుకు 60 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఈ బైకును పట్టణ ప్రాంతాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
సుమారు 112 కేజీల బరువున్న హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లు కావడం గమనార్హం. ఒక ఫుల్ ట్యాంకుతో ఈ బైక్ 400 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 785 మీమీ వరకు ఉంటుంది. కాబట్టి పొట్టి రైడర్లకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగి ఉన్న ఈ బైక్.. ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అడ్జర్బార్, వెనుక 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఇది డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. కాబట్టి అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
Don’t Miss: ఇప్పుడు ‘మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ’ రూపంలో.. 32.85 కిమీ మైలేజ్: ధర తెలిస్తే..
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు డిమాండ్
భారతదేశంలో ఎన్నెన్ని బైకులు అందుబాటులో వచ్చినప్పటికీ.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులనే చాలామంది ఎంచుకుంటారు. జాబితాలో హీరో మోటోకార్ప్ బైకులు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి ధరలు తక్కువగా ఉండటం మాత్రమే ఆధునిక డిజైన్.. అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఈ బైకులను రోజువారీ ఉపయోగానికి విచ్చలవిడిగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ అందించే బైకులను మార్కెట్లో లాంఛ్ చేస్తూ మంచి అమ్మకాలను పొందుతున్నాయి.