ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు అప్పుల్లో ఉన్నట్లు.. హైదరాబాద్ ఇంటిని అమ్మకానికి ఉంచినట్లు వార్తలు తెరమీదికి వచ్చాయి. దీనిపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది.
అవన్నీ పుకార్లే..
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మంచు లక్ష్మి ప్రసన్న.. నేను అప్పుల్లో ఉన్నానని, హైదరాబాద్ ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వస్తున్న మాటలు పూర్తిగా అవాస్తవం. అవన్నీ పుకార్లు మాత్రమే. నాకు హైదరాబాద్‌లో ఇల్లే లేదు. గతంలో నేను ఉన్న ఆ ఇల్లు మా నాన్నకు చెందినది. దానిపై నాకు ఎలాంటి హక్కు లేదు. ఫిలింనగర్‌లో రెండేళ్ల క్రితం ఉన్నమాట నిజమే. ఆ ఇల్లు గురించి మా నాన్నకు అడిగితే చెబుతాడు. నేను ఉండటానికి మాత్రమే నాన్న నాకు ఇచ్చారు. కానీ నా ఇష్ట ప్రకారమే ముంబైకి వెళ్ళాను.
నాన్నను డబ్బు అడగలేదు
ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నాను. అక్కడ ఉన్న ఇంటికి అద్దె కట్టడానికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా.. నేను ఎప్పుడూ మా నాన్నను డబ్బు సహాయం చేయమని అడగలేదు. ఇంకెవరినీ కూడా అడగను. సినిమాలు, ఇతర షోల ద్వారా వచ్చిన డబ్బుతోనే నేను ముందుకు వెళ్తున్నాను. నాకు ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేదని మంచు లక్ష్మి ప్రసన్న క్లారిటీ ఇచ్చారు.
సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు
నిజానికి మంచు లక్ష్మి ప్రసన్న.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో పుట్టినప్పటికీ, స్వయంగా కష్టపడే తత్వం ఉన్న మహిళ. తాను చదువుకునే రోజుల్లో కూడా పార్ట్‌టైమ్ జాబ్ చేసిన విషయం బహుశా చాలామందికి తెలిసిందే. తండ్రిని అడిగితే ఎంతైనా ఇవ్వగలడు, కానీ తానే స్వయంగా ఎదగాలనే పట్టుదల ఉన్న మనిషి మన మంచు లక్ష్మి ప్రసన్న. వారసత్వాన్ని చూపించి ఎదిగే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో.. కూడా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మంచి వ్యక్తిత్వం.. అంతకు మించిన ధైర్యం ఉన్న లక్ష్మి ప్రసన్న ఎంతోమందికి ఆదర్శప్రాయం.
మంచు లక్ష్మి ప్రసన్న గురించి
1977 అక్టోబర్ 8న మంచు మోహన్ బాబు, విద్యాదేవి దంపతుల ఏకైక కుమార్తె. ఈమె చెన్నైలో జన్మించారు. ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. నిర్మాత, టీవీ ప్రెజెంటర్ (యాంకర్) కూడా. లక్ష్మి అమెరికన్ టెలివిజన్‌లో కూడా పనిచేశారు. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా.. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన ఈమె మల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఓ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది. కాగా ప్రస్తుతం ఈమె దక్ష సినిమా నటించింది.
దక్ష సినిమా గురించి
తండ్రి, కూతురు (మంచు మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న) కలిసి నటించిన మొదటి సినిమా దక్ష. ఈ సినిమా 19వ తేదీ (సెప్టెంబర్ 19) రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషించినట్లు.. లక్ష్మి ప్రసన్న ఇప్పటికే చెప్పేసింది. సముద్రఖని మొదలైనవారు కూడా ఇందులో నటించారు. వంశీకృష్ణ మల్లా.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.