Maruti Suzuki May 2024 Discounts: ఆధునిక భారతదేశంలో వాహన వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటికో బైక్ ఉన్నట్లు.. నేడు ఇంటికో కారు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓ కారు ఉంటుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దానికి తోడు కంపెనీలు కూడా అప్పుడప్పుడు అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చేసింది.
దేశీయ విఫణిలో అత్యంత పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో గ్రాండ్ విటారా, బాలెనొ, జిమ్నీ, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ఎల్6 మరియు ఫ్రాంక్స్ ఉన్నాయి. కంపెనీ ఈ కార్ల కొనుగోలు మీద క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్లను కస్టమర్లు నెక్సా డీలర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మారుతి ఫ్రాంక్స్
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనుగోలు మీద కస్టమర్ రూ.58000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.15000 క్యాష్ డిస్కౌంట్, రూ.30000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్, రూ.10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3000 విలువైన కార్పొరేట్ బెనిఫీట్స్, లభిస్తాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనుగోలు మీద రూ.23000 ప్రయోజనాలు, CNG వేరియంట్ కొనుగోలు మీద రూ.13000 వరకు బెనిఫీట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మారుతి గ్రాండ్ విటారా
గ్రాండ్ విటారా కొనుగోలు మీద మారుతి సుజుకి ఏకంగా రూ.74000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20000 క్యాష్ డిస్కౌంట్, రూ.50000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.4000 కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక డెల్టా పెట్రోల్ వేరియంట్ కొనుగోలు మీద రూ.44000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జీటా పోట్రోల్, ఆల్పా పెట్రోల్ కొనుగోలుపైన రూ. 59000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. సిగ్మా పెట్రోల్ మరియు CNG వేరియంట్ల మీద కేవలం రూ.4000 మాత్రమే ప్రయోజనాలను పొందవచ్చు.
మారుతి జిమ్నీ
థార్ SUVకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మారుతి జిమ్నీ (2023 మోడల్) కొనుగోలుపైనా కూడా కస్టమర్లు రూ.1.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే 2024 మోడల్ కొనుగోలుపైన మాత్రం కేవలం రూ. 50000 తగ్గింపు లభిస్తుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ మరియు 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది.
మారుతి ఇగ్నీస్
ఇగ్నీస్ యొక్క ఆటోమాటిక్ వేరియంట్స్ కొనుగోలు మీద రూ.53100 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ.48100 తగ్గింపు పొందవచ్చు. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హార్స్ పవర్ మరియు 113 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది.
మారుతి బాలెనో
బాలెనొ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ కొనుగోలు మీద కంపెనీ ఈ నెలలో రూ.50000 తగ్గింపు అందిస్తోంది. అదే సమయంలో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. CNG కారు కొనుగోలుపైన మారుతి సుజుకి రూ.35000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే లభిస్తాయి.
మారుతి సియాజ్
సియాజ్ యొక్క అన్ని వేరియంట్ల కొనుగోలు మీద కంపెనీ రూ.48000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇందులో రూ.20000 క్యాష్ డిస్కౌంట్, రూ.25000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సెడాన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Don’t Miss: దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు
మారుతి ఎక్స్ఎల్6
ఎక్స్ఎల్6 కొనుగోలు మీద మారుతి సుజుకి రూ.20000 మాత్రమే ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (103 హార్స్ పవర్) పొందుతుంది. అయితే ఎక్స్ఎల్6 యొక్క CNG వేరియంట్ కొనుగోలు మీద ఎటువంటి తగ్గింపులను అందుబాటులో లేదు.
Note: మారుతి సుజుకి అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఈ నెల(మే 31) చివరి వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బహుశా వచ్చే నెలలో ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.