MG Motors Discounts: 2024 ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ ధరలను భారీగా పెంచుకుంటూ పోతూ ఉంటే.. ‘ఎంజీ మోటార్ ఇండియా’ (MG Motor India) మాత్రం ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇంతకీ ఏ వేరియంట్ మీద, ఎంత వరకు ధరలు తగ్గించింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
కంపెనీ ఎంపిక చేసిన కార్ల జాబితాలో ఒకటి కామెట్ ఈవీ. ఈ కార్ల ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 8.58 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ తన బేస్ మోడల్ మీద రూ. 99,000 తగ్గింపును ప్రకటించింది. కాగా ఇప్పుడు హై-స్పెక్ ప్లే మరియు ప్లష్ ట్రిమ్‌ల మీద రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు అందిస్తుంది.
ఎంజీ కామెట్ ఈవీ పేస్
➤పాత ధర – రూ. 7.98 లక్షలు
➤కొత్త ధర – రూ. 6.99 లక్షలు
➤తగ్గింపు – రూ. 99000
MG కామెట్ ఈవీ ప్లే
➤పాత ధర – రూ. 9.28 లక్షలు
➤కొత్త ధర – రూ. 7.88 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.40 లక్షలు
ఎంజి కామెట్ ఈవీ ప్లస్
➤పాత ధర – రూ. 9.98 లక్షలు
➤కొత్త ధర – రూ. 8.58 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.40 లక్షలు
తగ్గిన ధరలను గమనిస్తే.. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారుగా ఎంజి కామెట్ ఈవీ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా టియాగో ఈవీ ధరలతో (రూ. 8.29 లక్షల – రూ. 12.09 లక్షలు) పోలిస్తే.. కామెట్ ఈవీ ధరలు చాలా తక్కువని అర్థమవుతోంది.
రెండు డోర్స్ కలిగిన ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ కారు మంచి పనితీరుని అందిస్తూ.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 42 హార్స్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని ప్రత్యర్థి టియాగో ఈవీ రేంజ్ 250 కిమీ అని తెలుస్తోంది. ఇందులో 19.2 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 61 హార్స్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)
MG మోటార్ కంపెనీ కేవలం కామెట్ ఈవీ ధర మాత్రమే కాకుండా మరో ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ ఈవీ ధరలను కూడా భారీగానే తగ్గించింది. ప్రస్తుతం ఉన్న ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎక్స్‌క్లూజివ్ ప్రో ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ. 2.9 లక్షలు, రూ. 1.02 లక్షలు మరియు రూ. 92000 తగ్గాయి.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎగ్జిక్యూటివ్
➤పాత ధర – రూ. 18.98 లక్షలు (ఈ వేరియంట్ మీద ఎలాంటి తగ్గింపు లేదు)
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్
➤పాత ధర – రూ. 22.88 లక్షలు
➤కొత్త ధర – రూ. 19.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 2.90 లక్షలు
Don’t Miss: మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్
➤పాత ధర – రూ. 25.00 లక్షలు
➤కొత్త ధర – రూ. 23.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.02 లక్షలు
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ప్రో
➤పాత ధర – రూ. 25.90 లక్షలు
➤కొత్త ధర – రూ. 24.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 92000 లక్షలు