యువ నటుడు తేజ సజ్జ నటించిన మిరాయ్ బ్లాక్ బ్లాస్టర్ సాధించి.. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించిన సందర్భంగా.. మంగళవారం విజవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. డైరెక్టర్ ఇతర చిత్ర బృందం, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
కోరుకున్న కారు గిఫ్ట్
మిరాయ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఇంత గొప్ప హిట్ సాధించడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందని అన్నారు. అంతే కాకుండా సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా.. హీరో తేజ సజ్జకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి.. వాళ్లు ఏ కారు కోరుకుంటే, ఆ కారును గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నారు.
రూ. 100 కోట్ల మార్క్..
హనుమాన్ సినిమా తరువాత తేజ సజ్జ నటించిన ఈ మిరాయ్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటుడు మంచు మనోజ్ ఈ సినిమాకు అదనపు ఎనర్జీ అందించగా.. సీనియర్ నటి శ్రియ తన నటనతో ఆకట్టుకుంది. ఇక రితిక్ నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బ్లస్టర్ చేరిపోయింది. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్కును చేరుకున్న ఈ సినిమా.. ఇంకా వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
మిరాయ్ సినిమా గురించి
అశోకుడి కాలం నాటికి చెందిన కథగా ఇందులో చెప్పడం జరిగింది. కొన్ని అద్భుతమైన గ్రంధాలలో అతీతమైన శక్తులు ఉన్నాయని, వాటిని పొందితే మనిషి దేవుడవుతాడు. మహాబీర్ (మంచు మనోజ్) వీటిని దక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఎనిమిది గ్రంధాలను సొంతం చేసుకుంటాడు. అయితే చివరి గ్రంధం పొందాలనుకుంటాడు. వేద ప్రజాపతి (తేజ సజ్జ) ఆ గ్రంధాన్ని కాపాడే దశలో మిరాయ్ సాధిస్తాడు. విభా (రితిక నాయక్) సాయంతో గతాన్ని తెలుసుకుని.. మహాబీర్ తొమ్మిదో గ్రంధం ద్వారా శక్తులను సొంతం చేసుకోకుండా అవుతాడు. జగపతి బాబు, శ్రియ కూడా తమదైన నటనతో అద్భుతం సృష్టించారు. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.
మిరాయ్ నటీనటుల రెమ్యునరేషన్
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జ.. హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన హనుమాన్ సినిమాకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఇతడు మిరాయ్ సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్, శ్రియ కూడా ఒక్కొక్కరు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా.. జగపతి బాబు రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే రితికా నాయక్ రెమ్యునరేషన్ రూ. 50 లక్షలు అని తెలుస్తోంది.