Modi Govt Launches New Aadhaar App With Face ID: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రంగంలోనూ ప్రజలకు సులభమైన మార్గాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం ఓ ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చారు. క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధ్రువీకరణ జరుగుతుంది. యూపీఐ కోడ్ స్కాన్ చేసినట్లుగా నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ‘అశ్విని వైష్ణవ్’ (Ashwini Vaishnaw) తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ తమ గుర్తింపుగా ఆధార్ కార్డును కలిగి ఉంటారు. చాలా చోట్ల ఆధార్ వివరాలను వెల్లడించడానికి ఫిజికల్ కార్డు లేదం జిరాక్స్ అయిన చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ.. తమ ఆధార్ కార్డును తమవద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ స్కాన్ విధానాన్ని తీసుకొచ్చింది.
ధ్రువీకరణ కోసం యాప్
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధ్రువీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. పరీక్షలు విజయవంతమైన తరువాత దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. ఇదే జరిగితే ఎవరూ తమ జేబులో ఆధార్ కార్డును పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఆధార్ వెరిఫికేషన్ భాగస్వాముల దగ్గర ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యం ఉంటుంది. దీనిని స్కాన్ చేయగానే ముఖాన్ని గుర్తించడానికి (పేస్ వెరిఫై) ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పేస్ స్కాన్ పూర్తయిన వెంటనే.. మీ వివరాలు వెరిఫై అయిపోతాయి. అయితే ఇది చాలా సురక్షితంగా ఉంటుందని. ప్రజల వివరాలు బయటకు వెళ్లవని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అశ్విని వైష్ణవ్ ట్వీట్
ఒక చిన్న వీడియోను షేర్ చేస్తూ.. కొత్త ఆధార్ యాప్, మొబైల్ యాప్‌లోనే పేస్ అథెంటికేషన్. ఫిజికల్ కార్డు అవసరం లేదు, ఫోటో కాపీ కూడా అవసరం లేదు అని మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఇది భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కానీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించకలేదు. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో (బీటా వెర్షన్) ఉంది. కాబట్టి తొందరగానే ఇది అందుబాటులో వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..
ఆధార్ స్కాన్ ఉపయోగాలు
భారతదేశంలో లేదా భారతీయ పౌరులకు గుర్తింపు కార్డు ఈ ఆధార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటి కోసం అప్లై చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అంతే కాకుండా చాలా సమయాల్లో ధృవీకరణ కోసం ఈ ఆధార్ కార్డు పనికొస్తుంది. కాబట్టి ఎప్పుడూ దీనిని వెంట ఉంచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత ఆధార్ ఫిజికల్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరమని ఉండదు.
క్యూ ఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. హోటల్స్ రిసెప్షన్లలో లేదా ఇతర ప్రయాణ సమయాల్లో ఆధార్ కార్డును చూపించమని చెబితే, జస్ట్ స్కాన్ చేసి చూపించవచ్చు. ఇది వంద శాతం డిజిటల్.. సురయుతమైంది కూడా. కాబట్టి మీ వివరాలు బయటకు లీక్ అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు.
New Aadhaar App
Face ID authentication via mobile app❌ No physical card
❌ No photocopies🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025