ఈ నెలలో (2025 అక్టోబర్) లాంచ్ అయ్యే కార్లు: ఆక్టావియా ఆర్ఎస్ నుంచి ఎయిర్‌క్రాస్ ఎక్స్ వరకు

2025 మొదలైన 8 నెలలు పూర్తయ్యాయి. ఈ సమయంలో లెక్కకు మించిన కార్లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. కాగా ఈ నెలలో (2025 అక్టోబర్) కూడా కొన్ని కార్లు దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏ కార్లు లాంచ్ కానున్నాయి?, ఎప్పుడు లాంచ్ కానున్నాయి?, వాటి వివరాలు ఏమిటి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్

స్కోడా కంపెనీ అక్టోబర్ 17న తన 2025 ఆక్టావియా ఆర్ఎస్ కారును లాంచ్ చేయనుంది. కంపెనీ ఈ కారు కోసం అక్టోబర్ 6 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. కాగా ఏ కారు భారతదేశంలో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం. డెలివరీలు డిసెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న ఆక్టావియా ఆర్ఎస్ 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 265 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం కావడం గమనార్హం.

మినీ కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యు అల్4

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో మినీ కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యు ఆల్4 ఒకటి. ఇది అక్టోబర్ 14న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ దీని కోసం ఇప్పటికే ఆన్‌లైను & ఆఫ్‌లైన్ బుకింగ్స్ స్వీకరించడం సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించింది. ఈ కారు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 300 హార్స్ పవర్ లాంచ్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందవచ్చు. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్

థార్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెలలో (అక్టోబర్ 2025) లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న థార్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయితే.. తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. అందులోనే పండుగల సమయంలో లాంచ్ అయితే అమ్మకాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ కారు సీ టైప్ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మొదలైనవి పొందుతుందని సమాచారం. కాగా ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్

ప్రెంచ్ వాహన తయారీ సంస్థ కూడా ఈ నెలలో తన ఎయిర్‌క్రాస్ ఎక్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అయితే కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ నెల చివరి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. కాగా దీనికోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎయిర్‌క్రాస్ ఎక్స్ అనేది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత అప్డేట్స్ పొందినట్లు సమాచారం. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. కాబట్టి అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. ఈ కారు ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.