మార్కెట్లో సరికొత్త డిజైర్: రూ. 11వేలకే బుకింగ్స్

New Maruti Suzuki Dzire Unveiled: ఎంత గొప్ప వెహికల్ అయినా.. ఎప్పటికప్పుడు అప్డేట్ చెందాలి. లేకుంటే కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పడిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి (Maruti Suzuki) 2017లో లాంచ్ చేసిన ‘డిజైర్’ (Dzire) కారును ఇప్పుడు ఆధునిక హంగులతో.. అప్డేటెడ్ రూపంలో మార్కెట్లో ఆవిష్కారించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.

లాంచ్ డేట్ & బుకింగ్ ప్రైస్

మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త 2025 మారుతి డిజైర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అయితే స్విఫ్ట్ మాదిరిగా.. అదే త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్ పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ ధరలను నవంబర్ 11న వెల్లడించనుంది. కాగా ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. కాబట్టి రూ. 11,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

సరికొత్త డిజైన్ & ఫీచర్స్

2025 మారుతి డిజైర్ కారు.. కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే హెడ్‌ల్యాంప్ ఇప్పుడు ఈ కారులో చూడవచ్చు. సిల్హౌట్ కూడా పాత మోడల్‌కు భిన్నంగా ఉంటుంది. బ్రాండ్ లోగో, కింద భాగంలో ఫాగ్ లాంప్ వంటివి చూడవచ్చు. కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వెనుక వైపు కొత్త టెయిల్ లాంప్ కూడా చూడవచ్చు.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త డిజైర్ ఎక్స్టీరియర్.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ.. ఇంటీరియర్ మాత్రం పెద్ద మార్పులకు లేదా అప్డేట్లకు గురికాలేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో ప్రీస్టాండింగ్ 9.0 ఇంచెస్ డిస్‌ప్లే, స్టీరింగ్ వీల్, స్విచ్ గేర్, అనలాగ్ డయల్స్ వంటి రిటైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అనేది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

Don’t Miss: అన్నంత పని చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్: చెప్పినట్లుగానే మరో బైక్ లాంచ్

అంతే కాకుండా.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, హోల్డ్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా డిజైర్ కారులో ఉన్నాయి.

ఇంజిన్ డీటైల్స్

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త మారుతి డిజైర్.. స్విఫ్ట్ మాదిరిగానే అదే జెడ్ సిరీస్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.5 Bhp పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.