ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) 2025 ఏడాదికిగానూ.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కథనంలో ఏ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు?, అప్లై చేసుకోవడానికి లాస్ట్ ఎప్పుడు?, విద్యార్హత వంటి చాలా వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. 30 డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దీనికోసం దరఖాస్తులు (2025 డిసెంబర్ 9) స్వీకరణ ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆఖరు తేదీ 2026 జనవరి 08. గుర్తుంచుకోవలసిన విషయం అభ్యర్థులు లాస్ట్ డేట్ కంటే కూడా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. బహుశా చివరి రోజుల్లో సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ & వయసు, ఫీజు వివరాలు
ఎన్హెచ్ఏఐ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంబంధిత ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ/బీ.టెక్ పూర్తి చేసి ఉండాలి. కాగా దరఖాస్తుదారుని వయసు 2026 జనవరి 1నాటికి 56 సంవత్సరాలు దాటకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. కాగా దరఖాస్తుదారులు ఉద్యోగానికి అప్లై చేసుకోటానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఎన్హెచ్ఏఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం నెలకు రూ. 78800 నుంచి రూ. 2,09,200 వరకు ఉంటుంది. అంతే కాకుండా ప్రభుత్వం అందించే ప్రత్యేక అలవెన్సులు కూడా లభిస్తాయి. దీనికి సంబంధించిన విషయాలు ఉద్యోగానికి ఎంపికైన తరువాత తెలుస్తాయి. ఎంపిక ప్రక్రియ.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే రెండు విధాలుగా ఉంటుంది.
ఇలా అప్లై చేసుకోవాలి
- ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దీనికోసం అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి.. రిక్రూట్మెంట్/కెరీర్ విభాగానికి వెళ్లాలి. తరువాత డిప్యూటీ జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
- నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తరువాత.. అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.
- లింక్ ఓపెన్ చేసిన తరువాత.. మీకు సంబంధించిన వివరాలు లేదా అవసరమైన వివరాలు ఫిల్ చేయాలి.
- అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత.. అన్నీ సరిగ్గా ఉన్నాయా?, లేదా?, అని చెక్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
- తరువాత అవసరం కోసం.. అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
చివరగా..
ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశం. 30 ఖాళీలు మాత్రమే ఉన్నాయని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీకు కావాల్సింది ఒక్క ఉద్యోగమే కదా. ఇది గుర్తుంచుకుని కష్టపడండి. తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. చివరి నిమిషం వరకు పోరాడండి. వస్తే ఉద్యోగం వస్తుంది. లేకుంటే అనుభవం మిగులుతుంది. ఆ అనుభవమే తరువాత ఉద్యోగానికి సిద్దమైనప్పుడు పనికొస్తుంది. సక్సెస్ సాధించేవరకు విశ్రమించకు. అప్పుడే విజయలక్ష్మి నిన్ను వరిస్తుంది. మహానుభావులు చెప్పినట్లు.. పనిచెయ్ ఫలితం ఎదో ఒకరోజు వస్తుంది. మీ పని మీరు పూర్తిగా చేసేయండి. తప్పకుండా ఎదో ఒక మంచి జాబ్ వచ్చేస్తుంది.