ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

Nissan X-Trail Launched in India: వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’ (Nissan X-Trail) ఎట్టకేలకు భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటి వరకు కేవలం ఒక కారును మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్.. ఇప్పుడు మరో కారును విక్రయించడానికి సిద్ధమైంది.

ధర (price)

సుదీర్ఘ నిరీక్షణ తరువాత నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎక్స్-ట్రైల్ ప్రారంభ ధర రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఆ కారణంగానే ఈ ఎస్‌యూవీ ధర కొంత ఎక్కువగా ఉంది.

డిజైన్ (Design)

చూడగానే ఆకర్శించబడే నిస్సాన్ కొత్త కారు ఎక్స్-ట్రైల్ వీ-మోషన్ గ్రిల్ పొందుతుంది. దీనికి చివర హెడ్‌లైట్స్ ఉన్నాయి. వాటికి కింద డీఆర్ఎల్ చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. వెనుక వైపు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ మరియు టెయిల్ ల్యాంప్ సెట్ ఉంది. మొత్తం మీద డిజైన్ ఆధునిక కాలంలో వాహన ప్రియులను ఆకర్శించే విధంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

ఫీచర్స్ (Features)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అనేది 7 సీటర్ కాన్ఫిగరేషన్ మోడల్. అంటే ఇది 7 సీటర్ కారు. కాబట్టి క్యాబిన్ విశాలంగా ఉంటుంది. లోపల మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ఎక్స్-ట్రైల్ అనేది 7 సీటర్ రూపంలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఈ కారు యొక్క రెండో వరుసలో 40/20/40 స్ప్లిట్ ఫోల్డింగ్, స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా మూడో వరుసలో 50/50 స్ప్లిట్ ఫోల్డింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వాహన అవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ (Engine)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ వేరియబుల్ కంప్రెషన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది 4800 rpm వద్ద 161 Bhp పవర్ మరియు 2800 – 3600 rpm వద్ద 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 13.7 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

నిస్సాన్ యొక్క కొత్త ఎక్స్-ట్రైల్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో ఉపయోగపడతాయి. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్స్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి.

ప్రత్యర్థులు (Rivals)

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner), స్కోడా కొడియాక్ (Skoda Kodiaq), జీప్ మెరిడియన్ (Jeep Meridian) మరియు ఎంజీ గ్లోస్టర్ (MG Gloster) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఈ కారు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

Don’t Miss: ‘తాప్సి’ గ్యారేజిలోని కళ్ళు చెదిరే కార్లు.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే!

నిస్సాన్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో మాగ్నైట్ కారును విజయవంతంగా విక్రయిస్తోంది. ఈ తరుణంలో సంస్థ మరో కారును ఎక్స్-ట్రైల్ పేరుతో లాంచ్ చేసింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కార్లను లాంచ్ చేసే అవకాశం ఉందని.. మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని కూడా ఆశిస్తున్నాము.