10వ తరగతి/ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: 1426 పోస్టులకు నోటిఫికేషన్

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ సోల్జర్ రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఈ సారి ఏకంగా 1426 సోల్జర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్. సరైన అర్హతలు కలిగి.. ఆర్మీ జాబ్ కోసం వేచి చూస్తున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు

మొత్తం 1426 పోస్టులలో.. 1372 సోల్జర్స్ (జనరల్ డ్యూటీ), 07 సోల్జర్ (క్లర్క్), 19 సోల్జర్ (చెఫ్ కమ్యూనిటీ), 03 సోల్జర్ (చెఫ్ స్పెషల్), 02 సోల్జర్ (మెస్ కుక్), 03 సోల్జర్ (ఈఆర్), 02 సోల్జర్ (స్టీవార్డ్), 02 సోల్జర్ (ఆర్డిసాన్ మెటలర్జీ), 02 సోల్జర్ (ఆర్టిసాన్ వుడ్ వర్క్), 05 సోల్జర్ (హెయిర్ డ్రెస్సర్), 01 సోల్జర్ (టైలర్), 03 సోల్జర్ (హౌస్ కీపర్), 04 సోల్జర్ (వాషర్‌మన్) వంటివి ఉన్నాయి.

క్వాలిఫికేషన్ డీటైల్స్

  • సోల్జర్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి.
  • సోల్జర్ (క్లర్క్): ఈ పోస్టులు అప్లై చేయాలనుకునేవారు 12వ తరగతి / ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్: 10వ తరగతి పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్ (హౌస్ కీపర్, మెస్ కుక్ పోస్టుకు కాకుండా): 8వ తరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి & దరఖాస్తు విధానం

నోటిఫికేషన్ ప్రకారం ఈ ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. కాగా వయసు సడలింపుకు సంబంధించిన నియమాలు వర్తించవు. ఈ ఉద్యోగానికి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయానికి వస్తే.. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనే నాలుగు విధాలుగా ఉంటుందని సమాచారం. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వచ్చే నెల 15 (2025 నవంబర్ 11) నుంచి 2025 డిసెంబర్ 01 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఎప్పుడు అనే విషయం.. అప్లై చేసుకున్న తరువాత తెలుస్తుంది. ఎంపికైన వారికి జీతాలు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

ఉద్యోగానికి ఎలా సిద్ధమవ్వాలి

నిజానికి ఆర్మీ జాబ్ అంటేనే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అలా అని ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కాబట్టి రాత పరీక్షకు కూడా అభ్యర్థులు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ పోటీని ఎదుర్కోవడానికి నేర్పుతో సిద్ధమవ్వాలి. పరీక్షలు ఏ సిలబస్ చదవాలి?, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ అవేర్నెస్ వంటి వాటిపై మంచి పట్టు సాదించాలి. మొత్తం మీద మీ ప్రయత్నం గట్టిగా ఉంటే.. తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. దీనికి తగిన విధంగా సన్నద్ధమవ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా వ్యాయామం అవసరం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.