గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

Ola Electric Ganesh Chaturthi Special Offers: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ వంటి మోడల్స్ లాంచ్ చేసి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లను పెంచుకోవటానికి ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ‘వినాయక చవితి’ పండుగను పురస్కరించుకుని ఎంపిక చేసిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఈ తగ్గింపులలో.. అదనపు ప్రోత్సాహకాలు మరియు బ్యాంకింగ్ ప్రమోషన్స్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ అవకాశం ఈ రోజుతో (సెప్టెంబర్ 7) ముంగుస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వ్యవధిని మళ్ళీ పెంచుతుందా? లేదా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఎస్1 ప్రో (S1 Pro)

ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ప్రో స్కూటర్ మీద రూ. 5000 తగ్గింపును అందిస్తుంది. ఈ అవకాశం కర్ణాటక, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్, నాగ్‌పూర్, నాసిక్, కలకత్తా మరియు చండీగఢ్ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఎస్1 ఎక్స్ మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ (S1 X and S1 X+)

ఓలా ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్ వేరియంట్) మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ల మీద కంపెనీ రూ. 5000 తగ్గింపు అందిస్తుంది. ధరల తగ్గింపు తరువాత ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ. 96999 మరియు రూ. 89999 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ తగ్గింపులు దేశ్యవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. ఎస్1 ప్రో మాదిరిగా పరిమితులు లేదు.

ఎక్స్‌ఛేంజ్ బోనస్ (Exchange Bonus)

ధరల తగ్గింపు మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ తన పాత టూ వీలర్స్ మీద ఎక్స్‌ఛేంజ్ బోనస్ ప్రకటించింది. దీనికింద రూ. 12000 ప్రయోజనాలను పొందవచ్చు. ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్) ఎంచుకునే వారు రూ. 8000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఇతర ప్రయోజనాలలో యాక్ససరీస్ మీద 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధీకృత డీలర్షిప్ లేదా ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

బ్యాంకింగ్ ప్రమోషన్స్

ఓలా ఎలక్ట్రిక్ అదనపు ప్రయోజనాల కింద.. వివిధ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇందులో యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‍సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి. అంతే కాకుండా వన్ కార్డు క్రెడిట్ కార్డు వినియోగదారులు తొమ్మిది నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ ప్లాన్‌లను ఎంచుకున్నప్పుడు రూ. 5000లకు పరిమితం చేయబడిన 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఐడీఎఫ్‍సీ బ్యాంక్ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను అందిస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లకు 6.99 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. కస్టమర్లలకు కావలసిన ప్రయోజనాలను అందించడానికి కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇలాంటి ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. ఈ కంపెనీ దాదాపు ప్రతి పండుగకు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తూ ఉంటుంది. ఈ తరహాలోనే ఇప్పుడు కూడా ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది.. ఈ రోజు ముగుస్తుంది. బహుశా కంపెనీ ఈ అవకాశాన్ని పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా త్వరలో రాబోయే దసరా, దీపావళికి కూడా కంపెనీ మరిన్ని ఆఫర్స్ అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Don’t Miss: బంపరాఫర్.. కొత్త కారు కొనుగోలుపై రూ.2 లక్షల డిస్కౌంట్: పూర్తి వివరాలు చూడండి

నిజానికి భారతదేశంలో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ.. కంపెనీ నేడు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ ముందుకు సాగుతోంది.