పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్‌కు ‘పవర్’ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభినుల చేయి మేడమీదకు వెళ్తుంది. యువకుల మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు కేవలం ఇదొక పేరు కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభంజనం. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ప్రస్థానం గురించి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా వివరంగా తెలుసుకుందాం.

ప్రారంభ జీవితం

1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ జన్మించారు. ఈయన నెల్లూరు, మద్రాస్ మొదలైన ప్రాంతాల్లో చదువుకున్నారు. 1997లో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనల తరువాత.. ఇషిన్ ర్యూ కరాటే అసోషియేషన్.. ఇతనికి పవర్ అనే బిరుదును ఇచ్చింది. ఈయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.

సినిమా జీవితం

1996లో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తరువాత వచ్చిన.. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలో గొప్ప విజయాలను సాధించాయి. ఆ తరువాత వచ్చిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.

వరుస అపజయాల తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మళ్ళీ ప్లాప్స్ పర్వం మొదలైందా అన్నట్లు.. పులి, తీన్ మార్, పంజా వంటివి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందాయి. గబ్బర్ సింగ్ సినిమా మంచి హిట్ సాధించింది. అత్తారింటికి దారేది సినిమా.. ఏకంగా మగధీర కలెక్షన్స్ క్రాస్ చేసినట్టు సమాచారం.

విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటించిన.. గోపాల గోపాల సినిమా విజయం సాధించింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ప్రతికూల విజయాలను అందుకున్నాయి. వకీల్ సాబ్ అంతంత మాత్రమే అనిపించినా.. భీమ్లా నాయక్ పరవాలేదనిపించింది. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆశలన్నీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మీదనే పెట్టుకున్నారు.

రాజకీయ ప్రస్థానం

ప్రజలకు సేవ చేయాలనే గుణం బహుశా.. పవన్ కల్యాణ్‌కు పుట్టుకతోనే వచ్చిందా అనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో అగ్రగామిగా ఉన్న ఈయన.. అన్నీ వదిలి సాధారణ జీవితం హదుపుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే పార్టీ పెట్టారు, పట్టుదలతో ప్రజలకు చేరువై.. జనసేన పార్టీని నిలబెట్టారు. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు.

సినిమాల్లో ఉండేటప్పుడు జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడైతే పార్టీ పెట్టారో.. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలకు, అవమానాలకు గురయ్యారు. అవన్నీ తట్టుకుని.. ప్రత్యర్థులకు అడ్డుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ధీరత్వాన్ని చూసి.. జన సైనికులు, వీర మహిళలు సైతం ఆయనకు అండగా నిలిచారు. ఈ రోజుకి కూడా పవన్ కల్యాణ్‌ను అభినించేవారి సంఖ్య ఎక్కువగా ఉందంటే కారణం, ఆయన మంచితనం.. ఉదార స్వభావమే అని తెలుస్తోంది.

Leave a Comment