ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ) డైరెక్టర్ సుజీత్కు ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన కారు.. ల్యాండ్ రోవర్ డిఫెండర్. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే. నలుపు రంగులో కనిపించే ఈ కారు.. చాలా స్టైలిష్ డిజైన్ పొందినట్లు గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ కారును.. స్వయంగా అందించడం చూడవచ్చు. ఖరీదైన గిఫ్ట్ అందుకోవడంతో సుజీత్ ఆశ్చర్యపోయాడు.
సుజీత్ ట్వీట్
గిఫ్ట్ తీసుకున్న ఆనందంలో.. ”నా ప్రియమైన ఓజీ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన ప్రేమ, ప్రోత్సాహమే అన్నీ. చిన్నప్పుడు ఆయన అభిమానిగా ఉన్నప్పటి నుంచి.. ఈ ప్రత్యేక క్షణం వరకు. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని సుజీత్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఫోటోలను గమనిస్తే.. పవన్ కళ్యాణ్, సుజీత్ కోసం కారు డోర్ ఓపెన్ చేసి ఉండటం కూడా కనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం దర్శకునికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ)
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఇది పవర్ స్టార్ కెరియర్‌లో ఒక మైలురాయి. అంతకు ముందు రిలీజ్ అయిన బ్రో, హరిహర వీరమల్లు అంతగా కలెక్షన్స్ రాబట్టలేదు. అయితే ఓజీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో తెరమీద కనిపించనున్నారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్
చాలామంది సినీనటులు, ఇతర సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైన కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 1.29 కోట్ల నుంచి రూ. 3.18 కోట్ల మధ్య ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు.. గొప్ప ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.
అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు.. పెద్ద టచ్‌స్క్రీన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (ఏడీఏఎస్) ఫీచర్స్ పొందుతుంది. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగా ఇది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర ఎక్కువ కావడంతో.. ఎక్కువగా డబ్బున్న వారు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.
ఉస్తాద్ భగత్ సింగ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న.. పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు ముగిసింది. కాబట్టి ఇది 2026లో రిలీజ్ అవుతుంది. అయితే ఎప్పుడు, ఏ నెలలో లాంచ్ అవుతుందనే వివారాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. శ్రీలీల, రాశికన్నా కూడా నటిస్తున్నారు. ఇది కూడా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాము.