Hari Hara Veera Mallu Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు.. నిర్మాణ సంస్థ శుభవార్త చెప్పింది. 2025 మే 9న తెరమీదకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్లు ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం ఇప్పటికే ప్రకటించింది.
హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎం రత్నం సమర్పణలో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించగా.. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికే ‘కొల్లగొట్టినావురో’ పాటకు పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు అభిమానులను ఫిదా చేశాయి.
ఇతర నటులు
మే 9న తెరమీదకు రానున్న హరి హర వీరమల్లు సినిమాలో అమెరికన్ నటి ‘నర్గిస్ ఫఖ్రి’ (Nargis Fakhri) పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, సుబ్బరాజు, నజీర్, సునీల్ మరియు అనసూయ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
2023లో విడుదలైన బ్రో సినిమా తరువాత.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరి హరి వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే గతంలో ఈ సినిమా మార్చి 28న విడుదలవుతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా ఇప్పుడు రిలీజ్ డేట్ మే 9కు మారింది. ఈ సినిమా విడుదలకు ఆలస్యం కావడానికి పలు కారణాలు ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు ప్రకటించిన తేదీ (మే 9)న ఖచ్చితంగా విడుదలవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
స్వయంగా పాటపాడిన పవన్ కళ్యాణ్
ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోలు లేదా హీరోయిన్స్ స్వయంగా పాటలు పాడి అలరిస్తున్నారు. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ వ్యక్తి. తమ్ముడు సినిమాలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాటపాడి అలరించారు. కాగా ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాలో కూడా పవర్ స్టార్ మాట వినాలి గురుడా.. అంటూ పాట పాడారు.
Also Read: ‘డాకు’ బ్యూటీ జోరు.. అలాంటి కారు కొన్న మొట్టమొదటి నటిగా రికార్డు
పవన్ కళ్యాణ్ మరో సినిమా
హరి హర వీరమల్లు సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఓజీ (OG). ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. కానీ ఎప్పుడు విడుదలవుతుందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.
ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అజయ్ ఘోష్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.