Porsche Macan EV Turbo launched In India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘పోర్స్చే’ (Porsche) భారతీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు ‘మకాన్ ఈవీ’ (Macan EV)ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు కోసం బుకింగ్స్ కూడా స్పీవీకరించడం మొదలుపెట్టింది. అయితే ఈ కథనంలో పోర్స్చే మకాన్ ఈవీ ధరలు, డెలివెరీ డీటైల్స్ వంటి మరిన్ని వివరాలు చూసేద్దాం.
ధర (Porsche Macan EV Price)
పోర్స్చే కంపెనీ లాంచ్ చేసిన కొత్త మకాన్ ఈవీ ధర రూ. 1.65 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డెలివరీలు 2024 రెండవ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంటుంది.
మకాన్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి మకాన్ టర్బో, మకాన్ 4. భారతీయ మార్కెట్లో కేవలం టర్బో ట్రిమ్ మాత్రమే లభించనున్నట్లు సమాచారం.
పోర్స్చే మకాన్ డిజైన్ (Porsche Macan EV Design)
డిజైన్ విషయానికి వస్తే.. కొత్త పోర్స్చే మకాన్ ఈవీ కొత్త హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌లు, వీల్స్ మరియు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ మరియు టెయిల్‌ల్యాంప్ వంటి వాటిని పొందుతుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు యాక్టివ్ ఫ్రంట్ ఫ్లాప్‌లు, అండర్ బాడీ కవర్లు మరియు అడాప్టివ్ రియర్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.
పోర్స్చే మకాన్ ఫీచర్స్ (Porsche Macan EV Features)
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో మూడు స్క్రీన్‌లు ఉంటాయి. అవి 12.6 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.9 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ హబ్ మరియు 10.9 ఇంచెస్ ప్యాసింజర్ స్క్రీన్. ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్‌ప్లే కూడా ఇందులో లభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బూట్ స్పేస్ 540 లీటర్ల వరకు ఉంటుంది.
బ్యాటరీ అండ్ రేంజ్ (Porsche Macan EV Battery And Range)
పోర్స్చే మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లో 100 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 591 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక మకాన్ ఈవీ 4ట్రిమ్‌లో ఉన్న బ్యాటరీ 613 కిమీ రేంజ్ అందిస్తుంది. మాకాన్ మోడల్‌లు ప్రతి యాక్సిల్‌పై సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ పర్మనెంట్ సింక్రోనస్ మోటార్‌లను కలిగి ఉంటాయి.
మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లోని మోటార్ 639 హార్స్ పవర్ మరియు 1130 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ కావడం గమనార్హం. ఇక మకాన్ 4 ట్రిమ్ కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
కొత్త పోర్స్చే మకాన్ ఈవీ 4 కొత్త ట్విన్-వాల్వ్ డంపర్‌లతో స్టీల్ సస్పెన్షన్‌పై నడుస్తుంది. అయితే మకాన్ టర్బో పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ మరియు వేరియబుల్ ఎలక్ట్రానిక్ డంపింగ్ కంట్రోల్‌తో మరింత అధునాతన ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ను పొందింది. మొత్తానికి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.
Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..
పోర్స్చే కార్లకు దేశీయ విఫణిలో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కంపెనీ కూడా కొత్త కార్లను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. కంపెనీ ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడం వల్ల వాహన ప్రియులు కూడా ఈ కార్ల మీద ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు. కాగా కంపెనీ లాంచ్ చేసిన మకాన్ ఈవీ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అంతే కాకుండా మరింత మంది వాహన ప్రియులను ఆకర్శించడానికి కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.