ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా మిత్రమండలి. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ ఫుల్ టాక్‌తో నడుస్తున్న లిటిల్ హార్ట్స్ సినిమా యూనిట్ మౌళి, శివాని, సాయి మార్తాండ్ చేతుల మీదుగా చిత్రమండలి సినిమా ట్రైలర్‌ను మంగళవారం (అక్టోబర్ 7) ఉదయం పదకొండు గంటలకు ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయడం జరిగింది.
అక్టోబర్ 16న రిలీజ్
మిత్రమండలి సినిమాని అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ప్రెజెంటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కథ బాగుంటే.. ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనిపించిందంటే.. బన్నీ వాసు ఆ చిన్న చిన్న చిత్రాలను తీసుకొని థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. ఈమధ్య హిట్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఆయనే రిలీజ్ చేశారు. అందుకనే రెండు టీమ్‌లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి.. ప్రేక్షకుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఏఏఏ సినిమాస్ అంతా నవ్వులతో, ఫుల్ జోక్స్‌తో నిండిపోయింది.
మొత్తం నవ్వులే..
సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్‌లోనే చూపించేశారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పకనే చెప్పేశారు. సినిమా మొత్తం కామెడీ స్టార్స్‌తో నింపేశారు. ప్రతి సన్నివేశం మనకు ఎంతో నవ్వు తెప్పిస్తుంది. ఇందులో కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మానందం, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య, ప్రసాద్ బెహరా, రఘు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, విటివి గణేష్, డైరెక్టర్ అనుదీప్, యాష్ టాగ్ నైంటీస్ అనిల్, వంశీధర్ గౌడ్ లాంటి ఎంతో మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత కామెడీ జెనరేట్ అవుతుంది అనేది.
జంబరు గింబరు లాలా.. అంటే?
రవితేజ వెంకీ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన వెరీ పాపులర్ డైలాగ్ మీమర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే డైలాగ్ “జంబరు గింబరు లాలా”. డైరెక్టర్ విజయేంద్ర అదే డైలాగ్ ని తీసుకుని మిత్రమండలి సినిమాలో ఒకపాటని క్రియేట్ చేశారు. అలా రాసి కంపోజ్ చేయడమే కాకుండా ఆ పాటకు బ్రహ్మానందంతోనే డాన్స్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పటికే ప్రేక్షకులలో ట్రెండ్ అయిపోయాయి. ఈ డైలాగ్‌కు అర్థం ఏంటని బ్రహ్మానందంను అడిగితే.. ప్రత్యేకించి మీనింగ్ అంటూ ఏమి లేదు, కేవలం నవ్వుకోవడం కోసమే అని చెప్పారు. హీరో, హీరోయిన్ కూడా ఈ పాటకి డాన్స్ చేశారు.
మిత్రమండలి చిత్ర బృందం
కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, సోమరాజు, విజయందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరించారు. బన్నీ వాసు సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చారు. సిద్దార్థ్ ఎస్‌జే సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటర్ కోదాటి పవన్ కల్యాణ్ బాధ్యత వహించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. కాగా ఈ సినిమా దీపావళికి అందరి ముఖాల్లో నవ్వులు పూయించడానికి థియేటర్లలో రిలీజ్ కానుంది.